నిప్పులకొలిమి
భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోహిణి కార్తె మొదలవడంతో మూడు రోజులుగా ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌లో అత్యధికంగా 46.2 డిగ్రీలు రికార్డయింది.
- గరిష్ఠంగా వెంకటాపూర్‌లో 46.2 డిగ్రీలు
- దంచికొడుతున్న ఎండలు
- మూడు రోజులుగా తీవ్రం
భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోహిణి కార్తె మొదలవడంతో మూడు రోజులుగా ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌లో అత్యధికంగా 46.2 డిగ్రీలు రికార్డయింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండ ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 9గంటల తర్వాత ఇంటినుంచి బయట అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా రద్దీ తగ్గిపోయి రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా వడదెబ్బ తగిలి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృత్యువాతపడ్డారు.
- వెంకటాపూర్(ములుగు) -46.2
- మొగుళ్లపల్లి(భూపాలపల్లి) -45.9
- కొమ్ములవంచ(మహబూబాబాద్)-44.8
- గొర్రెకుంట(వరంగల్)-45.1
- పులుకుర్తి(హనుమకొండ) -44.7
వడదెబ్బతో ముగ్గురి మృతి
చెన్నారావుపేట/మంగపేట/ ఏటూరునాగారం, మే31: వడదెబ్బ తగిలి ముగ్గురు మృతి చెందారు. చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(74) కూలికి వెళ్లగా రెండు రోజులుగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు (50) వృత్తి రీత్యా ఎలక్ట్రికల్ పనిచేసేవాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు శుక్రవారం ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బీపీ చెక్ చేస్తున్న క్రమంలో కుప్పకూలిపోయాడు. ఏటూరునాగారం మండలం షాపల్లిలో మతిస్థిమితం సరిగా లేని మహిళ అడవిలో వడదెబ్బకు గురై మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం సోని(31) బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త మహేశ్, కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. కాగా, షాపల్లి సమీపంలోని రాజన్నగుట్ట-చెల్పాక మధ్యలోని అడవిలో గురువారం మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. భర్త మహేశ్‌కు కూడా మతిస్థిమితం సరిగా లేదని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ మహేశ్ గీతే బాబా సాహెబ్ శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

