వెస్ట్ జోన్ పోలీసులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ
సీపీ డా. తరుణ్ జోషి | వెస్ట్ జోన్ పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి గురువారం నెల వారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

జనగామ : వెస్ట్ జోన్ పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి గురువారం నెల వారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జనగాం కలెక్టరేట్ సమావేశ ప్రాంగణంలో ఎర్పాటు చేసిన ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ వారీగా అధికారుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. నమోదైన కేసుల్లో నేస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై పోలీస్ కమిషనర్ సంబందిత పోలీస్ అధికారులను అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్బంగా పోలీస్ అధికారులు తమ పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకొవల్సిన చర్యలపై అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణే లక్ష్యం అధికారులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందు కొసం అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా నేరానికి పాల్పడే వారిలో భయం కలుగుతుందన్నారు.
నేరాల నియంత్రించడం కోసం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం అవసరమని, ముఖ్యంగా అధికారులు నేర దర్యాప్తు సమయంలో ఎస్.ఓ.పి పద్ధతి అనుసరించడం అవసరమని పేర్కొన్నారు.
ముఖ్యంగా చోరీలను కట్టడి కోసం కాలనీల్లో పెట్రోసిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో రాణించే విధంగా రూపొందించబడిన వర్టికల్స్ పనితీరుపై మరింత నైపుణ్యం పెంచుకోవాలని సీపీ సూచించారు.
భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే కేసులను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల సంబంధించిన గ్యాంగ్ ల సమాచారాన్ని సేకరించి వారి కదలికపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
సమావేశంలో వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఘన్ పూర్ ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఎసిపిలు వినోద్, రమేష్, ఇన్స్పెక్టర్లు బాలాజీ వరప్రసాద్, వినయ్ కుమార్, చేరాలు, శ్రీనివాస తో పాటు ఎస్.ఐలు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

