వన్యప్రాణుల దాహం తీరేదెలా
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సాసర్‌పిట్స్, వాటర్ హోల్స్‌ను గతంలో ఏర్పాటుచేయగా అధికారుల పర్యవేక్షణ లోపించి, తాగునీరు లభించక మూగజీవాలు అల్లాడుతున్నాయి.
- ఎండిపోయిన కుంటలు, పనిచేయని సోలార్ బోర్లు
- తాగునీటి కోసం అల్లాడుతున్న మూగజీవాలు
- సాసర్ పిట్స్, వాటర్ హోల్స్‌లో నీళ్లు నింపని అధికారులు
- అటవీ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులు
మహదేవపూర్, మార్చి 26 : వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సాసర్‌పిట్స్, వాటర్ హోల్స్‌ను గతంలో ఏర్పాటుచేయగా అధికారుల పర్యవేక్షణ లోపించి, తాగునీరు లభించక మూగజీవాలు అల్లాడుతున్నాయి. ఓ వైపు ఎండలు ముదురుతున్న సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోకుంటే జీవాల మనుగడకే ముప్పు వాటిల్లనుంది.
అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో మహదేవపూర్ అడవుల్లో సుమారు ఆరు సోలార్ బోర్లు, 20 సాసర్ పిట్స్, 20 వాటర్ హోల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో సోలార్ బోర్ సమీపంలో కృత్రిమంగా నీటికుంట తవ్వించారు. వేసవిలో బోర్ల సాయంతో నీటిని కుంటల్లో నింపి వన్యప్రాణులకు అందుబాటులో ఉంచాలి. కానీ అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో సోలార్ బోర్లు పనిచేయడం లేదు. దీంతో నీరు లేక కుంటలు ఎండిపోయి నెర్రెలుబారాయి. వేసవిలో ప్రత్యేకంగా ట్యాంకర్ ద్వారా సాసర్ పిట్స్, ఫామ్పాండ్స్లో నీటిని నింపాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఎక్కడ కూడా నీటిని నింపడం లేదు. ఈ విషయమై అటవీ శాఖ మండల అధికారి కమలను వివరణ కోరగా వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, సోలార్ బోర్లకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని, సాసర్ పిట్స్, కుంటల్లో నీరు నింపుతామని తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

