Gayatri Bank | ఆపద సమయాల్లో బాధిత కుటుంబానికి బీమాతో ఆర్థిక సాయం.. డీఆర్డీవో శ్రీను
ఆపద సమయాల్లో బాధిత కుటుంబానికి బీమాతో ఆర్థిక సాయం అందుతోందని డీఆర్డీవో శ్రీను సూచించారు. హనుమకొండలోని గాయత్రి కో-ఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు హనుమకొండకు చెందిన కుంటమల్ల గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
- గాయత్రి కో-ఆపరేటీవ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారుడికి రూ.లక్ష బీమా అందజేత
Gayatri Bank | హనుమకొండ : ఆపద సమయాల్లో బాధిత కుటుంబానికి బీమాతో ఆర్థిక సాయం అందుతోందని డీఆర్డీవో శ్రీను సూచించారు. హనుమకొండలోని గాయత్రి కో-ఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు హనుమకొండకు చెందిన కుంటమల్ల గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా, అతడు ప్రమాద బీమా చేయించుకోగా పరిహారంగా రూ.లక్ష బీమా మంజూరైంది.
కాగా నామినీ అయిన కుంటమల్ల స్వప్నకు ఆ చెక్కును బ్యాంకు ప్రతినిధులతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీను మాట్లాడారు. ఖాతాదారుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయత్రి కో-ఆపరేటీవ్ అర్బన్ బ్యాంకు అందిస్తున్న సేవలు, సామాజిక బాధ్యతను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మ్యాదరి సందీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

