సమన్వయంతో పనిచేయాలి
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా వాడుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం ఆయన రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని 40 గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, బరిలో నిలిచిన అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
- బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి
- ప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్ర్తాలుగా మలుచుకోవాలి
- కేసీఆర్ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ముఖ్య నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిశా నిర్దేశం
రాయపర్తి, నవంబర్ 30 : కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా వాడుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం ఆయన రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని 40 గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, బరిలో నిలిచిన అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నదని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రజలను కోరాలన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో పాటించాల్సిన పద్ధతులు, వ్యూహాలు, ప్రణాళికల రూపకల్పనలపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రేణులంతా సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్‌రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల కన్వీనర్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, రాంచందర్, భూక్యా సురేందర్‌రాథోడ్, చందులక్ష్మి, మల్లేశ్, బందెల బాలరాజు, కుంట రాంబాబు, చందురామ్, సతీశ్, చిన్నాల ఉప్పలయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన బుర్హాన్‌పల్లి గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, తనకు అత్యంత ఆప్తుడు బిజ్జాల సోమనాథం మృతి చెందగా, ఆయన మృతదేహం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.
బీఆర్ఎస్లో మాజీ జడ్పీటీసీ కమలాకర్ చేరిక
పెద్దవంగర : ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, కష్టకాలంలో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటూ, తగిన గుర్తింపు ఇస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా పరిధిలోని సర్పంచ్‌తండాకు చెందిన తొర్రూరు మాజీ జడ్పీటీసీ జా టోత్ కమలాకర్ ఇటీవల కాంగ్రెస్ పా ర్టీలో చేరారు. మళ్లీ ఆయన ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని దయాకర్‌రావు స్వగృహంలో తిరిగి సొంతగూటికి చేరారు. ఎర్రబెల్లి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని.., రాక్షసుడి చేతిలో పాలన పెట్టడంతో అన్ని వర్గాలు ఇబ్బందిపడుతున్నాయన్నారు. రైతు కష్టాలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల్లో ఎండగడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే 90శాతం గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు సోమనర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్రామయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వలసల నివారణే లక్ష్యం’
నెమ్మాది భిక్షంకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

