హనుమకొండ చౌరస్తా : లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi )ని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హనుమకొండలో కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) బుధవారం ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓటర్ల జాబితా, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని , సీఈసీ జ్ఞానేష్కుమార్ను పదవీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన భారీ నిరసన ర్యాలీపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కెఆర్ నాగరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ నినాదాలు చేశారు.