Collector Divakara T.S | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : కలెక్టర్ దివాకర టి.ఎస్.
ప్రతిరోజు ఉదయం యోగాసనాలు చేయడం వల్ల మెరుగైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
ములుగు : ప్రతిరోజు ఉదయం యోగాసనాలు చేయడం వల్ల మెరుగైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా నిర్వహిస్తున్న దశాబ్దపు ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. జిల్లా లోని వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్, ఇతర కార్యాలయ సిబ్బందికి జిల్లా ఆయుష్ శాఖ అధ్వర్యంలో యోగ శిక్షకుల చే శిక్షణ నిర్వహించారు.
కలెక్టర్ జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి యోగ శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలందరూ, అధికారులందరూ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ తమ ఆరోగ్యం కోసం కూడా తప్పకుండా కొంత సమయాన్ని కేటాయించి యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు యోగ చేయడం వలన బీపీ, షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు.
యోగ చేయడం వలన మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చని తెలిపారు. అధికారులను ప్రతిరోజు యోగా చేసి పని ఒత్తిడిని తగ్గించుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంనకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఆరోగ్యానికి సంబంధించిన మెలుకువలు తెలుసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

