బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 01, 2020 , 03:51:55

ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

కాజీపేట, జనవరి 31: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రారంభించి పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ అన్నలా.. మేనమామల అండగా నిలుస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దా స్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కాజీపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్కిల్‌-2 కార్యాలయంలో శుక్రవారం 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ అబూబక్కర్‌ అధ్యక్షతన పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కు లు పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో కనీవిని ఎరుగని రీతిలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులు ప్లాస్టిక్‌ను నిషేధించాలని సూచించారు. రాబోయే తరాలకు పచ్చటి తెలంగాణను అందించేందుకు ప్రతి ఒక్కరూ మేడారం జాతరలో మొక్కను నాటాలని సూచించారు.


 గత పాలకులు వైఫల్యం కారణంగా కాజీపేట నిర్లక్ష్యానికి గురైందని, కాజీపేటను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఫాతిమా బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో త్వరలోనే 40 పడకల దవాఖానను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని శుక్రవారం ఒక్కరోజే 296 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను (దాదాపు రూ.3కోట్ల రూపాయలు)  పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోడా డిన్నా, మాధ వి, దేవేందర్‌, కాజీపేట, హన్మకొండ మం డల తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు, కిరణ్‌ ప్రకాశ్‌, ఆర్టీఏ సభ్యుడు కాటాపురం రాజు, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు సుంచు కృష్ణ, కుడా డైరెక్టర్లు బొర్ర ఐలయ్య,  శివశంకర్‌, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, టీఆర్‌ఎస్‌ నాయకులు నార్లగిరి రమేశ్‌, శిరుమల్ల దశరథం, మహ్మద్‌ సోని, గబ్బెట శ్రీనివాస్‌, అఫ్జల్‌, అశోక్‌, శివకుమార్‌, సయ్యద్‌ సర్వర్‌,  నహీముద్దీన్‌, పులి రజినీకాంత్‌, మిట్టపల్లి రవీందర్‌, క్యాప్‌ రాజు, దువ్వ కనుకరాజు, నహీంజుబే ర్‌, మహమూద్‌, పాము రాజేశ్‌, రసూల్‌, వినయ్‌, శంకర్‌, సాధినేని సుధాకర్‌ పాల్గొన్నారు. 


ప్రభుత్వ దవాఖానలో తనిఖీ

 కాజీపేట పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని రికార్డులను ను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి సకాలంలో విధులకు హాజరవుతున్నారా..అనే విషయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ దవాఖానకు బోర్డు లేకపోవడం ఏమిటని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంత రం వైద్యాధికారితో మాట్లాడుతూ..త్వరలోనే ఇక్కడికి 40 పడకల దవాఖాన వస్తున్నట్లు తెలిపారు.  


logo
>>>>>>