Tigers Fight | అదో పెద్ద ఫారెస్ట్.. టూరిస్టులంతా రోడ్డుపై నుంచి వాహనాల్లో సఫారీ రైడ్‌కు బయలుదేరారు. సడెన్‌గా ఫారెస్ట్‌లో నుంచి పులులు ఒకదానికొకటి తలపడుతూ రోడ్డుపైకి వచ్చాయి. పులులు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుండగా.. టూరిస్టులంతా తమ వాహనాలు ఆపారు. అయితే పులులు రోడ్డుపక్కకు వెళ్లినప్పటికీ సఫారీల్లో ముందుకు వెళ్లాల్సిన టూరిస్టులు మాత్రం అక్కడే ఉండిపోయారు.
అంతటితో ఆగకుండా కొందరైతే పులులకు చాలా దగ్గరగా వెళ్లి సెల్ఫోన్లలో ఆ ఫైట్‌ను వీడియోలు తీశారు. క్రూరమృగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తాజా వీడియోతో మరోసారి అర్థం అవుతోంది.
అగ్రెసివ్‌గా ఉన్న పులుల పోరాటం నీ చివరి చూపు కావొచ్చు. దయచేసి వన్యప్రాణులకు దగ్గరగా వెళ్లిప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అంటూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది.
Their fight can turn into your last Sight 😒
Never crowd a scene like this. Can prove fatal to you. No amount of regulations can stop this. Behave like a responsible tourist. Respect their space. pic.twitter.com/fLU9JSWqQX
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) April 26, 2026