చంద్రకాంత్ తనంతట తాను కదలలేడు. తన పనులు తాను స్వతాహగా చేసుకోలేని పరిస్థితి. పుట్టుకతో వచ్చిన జెనెటిక్ డిజార్డర్‌తో ఇబ్బందులు ఎదురైనా.. జీవిత గమనంలో తాను అనుకున్నది సాధించాడు. పదిమంది ఉపాధి కలిపిస్తూనే.. ప్లాస్టిక్ ఉపయోగానికి చెక్ పెట్టాలని పోరాడుతున్నాడు. తన శ్రమను గుర్తించి పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ఆయనను ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో 2021లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫిక్కీ ఎక్సెలెన్స్ అవార్డును అందజేశారు. అసలు ఇంతకి ఆయన ఏమి చేశారు. ఎందుకు ఇన్ని అవార్డులు వచ్చాయో.. ఈ స్ఫూర్తివంతమైన స్టోరీని చూసి మనమూ స్ఫూర్తి పొందుదాం.