ఇంట్లో చిన్నపిల్లలకు అన్నం తినిపించడమంటే ఓ సాహసమనే చెప్పాలి. కొందరు పిల్లలు గబగబా తింటే మరికొందరు సతాయిస్తుంటారు. అయితే, వారిలో ఆకలిలేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో ఆకలిపెంచి, వాళ్లు గబగబా అన్నం తినే చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయట. మరి అవేంటో ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ శ్రీనివాసాచార్యుల మాటల్లో తెలుసుకుందాం రండి.