– బి. యాదగిరి, రాయగిరి.
అంటే మీరు మీ ఇంటిని ఈశాన్యం దిశకు తిప్పి కట్టారు. అందువల్ల మీ ద్వారాలు, వాటి చూపు మారిపోతూ ఉంటుంది. ఇల్లును సరిగ్గా రోడ్డును బట్టి నిర్మించాలి. ఆ రోడ్డు దిశాత్మకంగా ఉండాలి. అప్పుడే గృహం కుదురుగా కూర్చుంటుంది. స్థలం నిర్ధారణ వేళనే దిశ నిర్ధారణ కూడా జరగాలి. తర్వాత ఇంటిని ఈశాన్యం తిప్పి కట్టాల్సిన అవసరం ఉండదు. ఇంటిని ఎప్పుడూ తిప్పి కట్టవద్దు. స్థలం, రోడ్డు ఒక దిశకు నిలబడి ఉంటాయి. అది, ఆ దిశకు నైరుతి అయినా, దక్షిణ-పడమరలు అయినా.. సరే! దిశను రోడ్డు నిర్ణయిస్తుంది. రోడ్డును ముఖం చేస్తూ ఇల్లు కట్టాల్సి ఉంటుంది. ఇంటిని తిప్పి.. అంటే, ఈశాన్యం పెరిగేలా తూర్పు-ఉత్తరం గోడలు పెంచితే.. ఇంట్లో ఈశాన్య-నైరుతి కొలతలు పెరుగుతాయి. ఆ విధానం మంచిదికాదు. మీరు ద్వారాలు మార్చండి. లేదా గృహం మారిపోండి.
– ఎడ్ల పద్మ, పౌరాజీపేట.
ఈశాన్యం ఖాళీ స్థలం పెరిగి ఉండవచ్చు. ఆ పెరుగుదలకు కూడా ఒక నిర్దిష్ట ప్రమాణం ఉంటుంది. మన ఇష్టానుసారం ఎంతైనా పెంచితే.. అది పెద్ద దోషాన్ని ఇస్తుంది. అతి.. దేనికీ మంచిదికాదు. నైరుతి తెగి ఉంటే.. ఈశాన్యం పెరిగితే చాలు అనే ఈ జంట విధానం కరెక్ట్ కాదు. ఆ స్థలం ఈశాన్యం పెరిగినదైనా, నైరుతి లేనిదే అవుతుంది.

మగ పిల్లాడే కానీ, ఒక చేయిలేదు.. అంటే ఏంటి? మగవాడు కావడం వల్ల ఆ చేయి లోపం పోదుకదా! ఇంటికి నైరుతి లోపం మంచిదికాదు. ఆ లోపం స్థలానికి ఉంటే తప్పక.. ఆ లోపాన్ని సరిదిద్ది, మూలమట్టానికి సరిచేసుకోవాలి. అప్పుడు పెరిగిన ఈశాన్యం ప్రభావం ఆ చోట కట్టిన ఇంటికి ఎంతో వెలుగును, వృద్ధిని అందిస్తుంది.
– పి. రాజు, తోటపల్లి.
పడక గదికి, టాయిలెట్‌కి డోర్ వద్ద గడపను సిమెంట్‌తో కట్టుకుంటే.. నీళ్లు గదిలోకి రాకుండా ఆపేయవచ్చు. నీళ్లు పోవడానికి టాయిలెట్లో ఈశాన్యం మూల స్లోపు చేసుకుంటే.. సహజంగానే నీళ్లు వెళ్లిపోతాయి. అంత మాత్రానికి టాయిలెట్ గది ఫ్లోరింగ్ పెంచాల్సిన అవసరం లేదు. చాలాచోట్ల సంకెన్ చేసి, పైపులు లోపలినుంచి అమర్చి, టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నారు.

అయినా, టాయిలెట్లో ఫ్లోరింగ్ కొన్ని అంగుళాలు పెంచినంత మాత్రాన దోషం ఉండదు. అయితే, కిందికి ఫ్లోరింగ్ అధికంగా చేయడం మంచిదికాదు. నీటి వాటానికి ఫ్లోరింగ్ చేయడం వేరు. అడుగు దించి మెట్ల కింద టాయిలెట్ వేయడం దోషం అవుతుంది.
– డి. శ్రీనివాస్, మాసాన్‌పల్లి.
నైరుతిలో స్థలం ఎక్కువ ఉంది అంటే.. మీరు శాస్త్రపూరితంగా స్థలాన్ని విభజించలేదు. ఇంటి చుట్టూ ఎంత స్థలం ఉండాలి? అనేది ఇంటికి బలాన్ని, లేదా బలహీనతలను నిర్ధారిస్తుంది. మీరు వెంటనే ఇంటి నైరుతి భాగాన్ని సరైన కొలతలతో.. అంటే ఉత్తరం ఉన్న ఖాళీని లెక్కించి, అంతకన్నా తక్కువ స్థలం ఉండేలా కట్‌చేసి, ఆ మిగిలిన స్థలంలో ఏదైనా నిర్మాణం చేయండి.

దానిని గోడౌన్గానో, మీకు సంబంధించిన వారు ఉండటానికో వినియోగించండి. లేదా అమ్మివేయండి. మీకు మరొక గృహం నిర్మించాలని ఉంటే.. ఉన్న ఇంటిని తొలగించి, ఆ నైరుతి స్థానంలో మరొక చక్కని ఇల్లు కట్టుకోండి. అందులో నివాసం ఉండండి. అంతేకానీ,ఆ ఖాళీ స్థలాన్ని అలాగే వదిలి వేయకండి.అది అనేక ఆర్థిక నష్టాలను, అనారోగ్యాలను కలిగిస్తుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143