– పి. లక్ష్మీ ప్రసన్న, కొడంగల్.
మన కారణం లేకుండా ఏదీ రాదు. ఆ కారణం మనకు అంత తొందరగా అర్థం కాదు. ఎప్పుడో మన ఆలోచనల తీవ్రత లేదా ఇష్టాలు మనల్ని వంచిస్తాయి. కొన్నిసార్లు తెలిసీ, తెలియక నిర్ణయాలు తీసుకుంటాం. అవి ఎప్పుడు ఏ రూపంలో ఎలా పరిణమిస్తాయో.. తెలియదు. అందుకే, మనం ఉంటున్న స్థానం ‘ఉత్తమంగా’ ఉండాలి అంటోంది శాస్త్రం. మనిషి నూటికి ఎనభై శాతం తన ఆలోచనలతో, నిర్ణయాలతోనే అవస్థలు పడుతుంటాడు.
కారణం మనసు నియంత్రణలో లేకపోవడం. దానికి గత జీవన విధానం కారణం కావచ్చు. మన మొండితనం కావచ్చు. అన్నిటికీ ఇల్లు మీద తోయకూడదు. ఆలోచనకు, బుద్ధికీ ప్రాధాన్యం ఉంటుంది. మనసుకు బానిస కాకుండా మన పర్యవేక్షణ ఉండాలి. చాలావరకు తెలిసే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించే లక్షణం ఉంటుంది. అప్పుడు తప్పుడు నిర్ణయాలు వెలువడుతాయి. కాబట్టి, మన స్వీయ డిసిప్లేన్ కూడా ఉండాలి.
– వి. శ్రీనివాస్, బోరబండ.
ఇల్లు పైకి ఒక అంతస్తు లేచింది అంటే.. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మన కోరికలు, ఆడంబరాలు వేరు. నిర్మాణ సూత్రాలు వేరు. అలాగని మన ఇష్టానికే ఆ పద్ధతులు మారవు. మనమే సర్దుకోవాల్సి ఉంటుంది. ‘డూప్లెక్స్’ ఇల్లు కట్టినప్పుడు.. ‘రెండు ఇండ్లు కట్టాల్సి వస్తుంది’ అనుకొని యజమాని సంసిద్ధం కావాలి. అంటే ఇంటిపైన ఇల్లు.

అది కూడా సగం కడతాను. ఒక గదిని పైకి లేపుతాను అనేవి విరుద్ధమైన ఆలోచనలు. ఇంటిలో శక్తి విచ్ఛిన్నం కాకుండా విశాలంగా, గొప్ప వెలుగులతో, పూర్ణ ఆరోగ్యధామంగా నిలబడేది ‘డూప్లెక్స్’ భవనం. దాని వైభవం ఇతర గృహాలకు ఉండదు. కొందరిని విగ్రహంలా ఉన్నారు అంటాం. అంటే, శాస్త్రయుక్తంగా నిలిపిన ఆలయ మూల విరాట్టు లాంటివాడని అర్థం. ఆ శోభ, కీర్తి, ఐశ్వర్యం.. చెక్కిన శిల్పానికి ఒసగబడుతుంది. అలా ఇల్లు కట్టాలి. మీరు ఏ గదినీ పైకి లేపకండి. అన్నీ తెలుసుకొని, మీకు నచ్చిన విధంగా వాస్తు గృహం కట్టండి.
– ఎం. సింహాద్రి, లాలాగూడ.
ఇల్లు కట్టేది డబ్బులతోనే కాదు.. శాస్త్ర సమన్వయంతో కూడా. లోకంలో అందరూ తూర్పు అని, ఉత్తరం అని వెంపర్లాడుతూ ఉంటారు. అందుకని అన్ని దిశల ఇండ్లను తూర్పు ముఖంగా, లేదా ఉత్తరం ముఖంగానే కట్టాలనే భ్రాంతిలో ఉంటారు. అది మంచి విధానం కాదు. ఏ దిశ ఇల్లు ఆ దిశకు చెంది ఉండాలి. ఎవరి ఇంటి గోత్రం వారికి ఉన్నట్లు.. ఏ గృహం ముఖద్వారం ఆ దిశ రోడ్డును బట్టి ఉంటుంది. అప్పుడు ఆ దిశ ప్రధానంగా.. ఆ ఇంటికి ముఖద్వారం రావాల్సి ఉంటుంది. అలాగని దక్షిణ-పశ్చిమ ఇండ్లకు ఉత్తరం వైపు, తూర్పు వైపు ద్వారాలు పెట్టకూడదు అనికాదు. అన్ని దిశలకు అన్ని వైపులా ద్వారాలు ఉంటాయి. కానీ, అవి అన్నీ ప్రధాన ద్వారాలు కాకపోవచ్చు. మీరు దక్షిణ ద్వారం కలిగిన ఇంటినే మీ దక్షిణ స్థలంలో కట్టండి. అప్పుడే ఆ దిశ ప్రభావం మీకు ఉంటుంది. చక్కగా, శాస్త్రబద్ధంగా నక్ష (ప్లాన్) తయారు చేయించి.. నిర్మాణం ఆరంభించండి.
– కె.ఎల్. సుదర్శన్, హన్మకొండ.
ఇంటికి వెలుగులు రావడానికి కిటికీలు పెడుతారు. కిటికీ నిర్మాణం గ్లాసు, కర్ర, దాని చుట్టూ చెక్క ఫ్రేమ్‌తో ఉంటుంది. అలాకాకుండా, యూపీవీసీ కిటికీలు అయితే, వాటి నిర్మాణం వాటిది. వీటిని గదిలో ఒక మూల ఒకటి, మరొక మూల ఒకదానికి అనగా.. గదికి దక్షిణ-ఆగ్నేయంలో, అలాగే పడమర-నైరుతిలో.. ఇలా గదిని బట్టి ఆయా దిశలకు అమర్చుతూ ఉంటారు. క్రాస్ వెంటిలేషన్ కోసం. ఈ కిటికీలు ఎప్పుడూ ద్వారాలకు పోటు కావు.

ద్వారం ఎదురుగా కిటికీ ఉన్నాకూడా ద్వారం వెడల్పు కన్నా కిటికీ చిన్నదిగా, సన్నదిగా ఉన్నా.. అది, దానిలోని అడ్డు కర్రలు, గ్లాసులు, ద్వారానికి పోటుగా భావించకూడదు. ద్వారం మనిషి రాక పోకల కోసం ఉంటుంది. కిటికీలను వెలుగు-గాలి రాకలకు ఏర్పాటు చేస్తాం. పనులలో వ్యత్యాసం ఉంది. కారు నడిపినంత మాత్రాన డ్రైవర్ ఓనర్ కాడు. ఇంటికి వెంటిలేటర్స్, కిటికీలు, ద్వారాలు.. అనేవి పలు రకాల పనులు చేస్తాయి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143