– పి. సంపత్, కొంపల్లి.
డూప్లెక్స్ నిర్మాణాలకు ఆరోగ్య ప్రధానంగా ఈ స్లాబ్ కటింగ్స్ ఏర్పాటు చేశారు. అదికూడా ఇంటిలో దక్షిణం-పశ్చిమం మెట్లు, లిఫ్ట్ వస్తాయి కాబట్టి, వాటికి ప్రత్యామ్నాయంగా బ్యాలెన్స్ చేస్తూ.. గాలి, వెలుతురు, విశాలత కోసం మంచి లైవ్, అలాగే, భారీతనంగా ఉండటం కోసం విశాలమైన హాల్ ఏర్పాటుచేసి, దానిలో చక్కని సీత్రూ(హాలో) ఏర్పాటు చేయాలి. ఇదికాస్త అతిగా మారి ఒకచోట కాకుండా.. అనేక చోట్ల పెట్టి హడావుడి చేస్తున్నారు.
ఇది సరైన పద్ధతికాదు. ఏ చోట సీత్రూ ఉండాలో ఆ చోటనే ఉండాలి. పోతే.. ఒకటికన్నా ఎక్కువ కూడా మంచిదికాదు. ఉత్తరం-తూర్పు లేదా ఇంటి గర్భస్థానం.. ఇలా ఇంటి నిర్మాణ శైలిని బట్టి ఈ కోర్టు యార్డు లేదా సీత్రూ చాలా పద్ధతిగా చేయాల్సి ఉంటుంది. ఇంట్లో లివింగ్ స్పేస్ తగ్గకుండా, వాతావరణ సమతుల్యత కోల్పోకుండా ఉండాలి. మీరు తెలుసుకొని చేయండి.
– కె. మాధురి, చేవెళ్ల.
ఇంటి నిర్మాణంలో నైరుతి గది యజమాని కోసం. ఈశాన్య స్థానం అందరికోసం. నైరుతి గదిని ఓపెన్ చేసి, అందరూ వాడే బాల్కనీ చేయకూడదు. ఈశాన్యంలో గదిని కట్టి, ఒక్కరు వాడే బెడ్రూమ్, తదితర వాటికి మూతవేసి వినియోగించకూడదు. స్థాన శక్తులు ఒక్కోచోట విభిన్నంగా ఉంటాయి. వేటిని ఎలా వాడాలో.. అలాగే వాడాలి. మీరు తూర్పు భాగంలో దక్షిణ-ఆగ్నేయం నుంచి ఉత్తరానికి ఉన్న స్థలంలో ఈశాన్యం భాగం వదిలి.. అనగా, ఒక గది కొలత మేర ఆ ఇంటి విభజనను బట్టి వేరు చేసి, మిగతా భాగం హోమ్ థియేటర్ కోసం వాడుకోండి.

ఇంటి మేడమీద ఈశాన్య భాగం ఇంటి సభ్యులందరూ వాడుకునేలా ఒక లివింగ్ స్పేస్‌గా ఉండాలి. దానినుంచి తూర్పు-ఉత్తరాలకు వెళ్లేలా ద్వారాలు కూడా ఉండాలి. ఆ విధానం ఇంటిని లైవ్‌గా ఉంచుతుంది. శుభం, శాంతం కలగాలంటే.. ఆ విధంగానే కట్టాలి. అదే శాస్త్ర సమ్మతం.
– కె. సంధ్య, సీతాఫల్మండి.
ఇంటికి సాధారణంగా ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం వదులుతారు. అలాంటి చోట కార్లు ఒకదాని వెనుక ఒకటి పెట్టుకోవడానికి స్థలం ఉంటుంది. ఆ చోట కార్లు పెట్టుకోవచ్చు. ఆ స్థలాన్ని స్లాబ్‌తో పందిరిగా వేసినప్పుడు దాని వెడల్పును బట్టి అదనంగా పిల్లర్స్ వేయాల్సి వస్తుంది.

ఉత్తరంలో ఇరవై అడుగులు ఖాళీ ఉంటే.. ఉత్తరం కాంపౌండ్ నుంచి కనీసం ఖాళీ జాగా వదిలి, పిల్లర్స్ వేయాలి. ఆ స్థలం దక్షిణం ఖాళీ కన్నా ఒకటి రెండు అడుగులు ఎక్కువ ఉండాలి. ఈ విధానం వల్ల కింది ఫ్లోర్‌కి ఉత్తరంలో వెంటిలేషన్ తగ్గకుండా ఉంటుంది. ఈ పోర్టికో/ షెడ్డు ఏదైనా సరే.. పర్మినెంట్ చేసినప్పుడు ఇంటి పొడవుతో సమానంగా వేయాలి. అలాగే, ఉత్తరం ప్రహరీ మీదికి చేరకుండా వేయాలి. ప్రహరీ మీదినుంచి సపోర్ట్ పిల్లర్స్ వేయకూడదు.
– వి. రమేష్, బాలానగర్.
అసలు బాల్కనీలు ఉండే విధానం శాస్త్ర పద్ధతిని, హద్దును ఎప్పుడో దాటి వెళ్లిపోయింది. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ప్రయోగాలు చేస్తున్నారు. అదంతా చాలా విరుద్ధ విధానం. బాల్కనీ పుట్టింది అంతస్తులకు ఇంటికి చుట్టూ ‘ఓపెన్ ప్లేస్’ ఉండటం కోసం. అది ఇల్లు కాకుండా, ఇంటికి బయట ఉండాలి. అవి పై ఇండ్లకు ఊపిరి స్థానాలుగా నిలుస్తాయి. ఇల్లు కట్ చేసి వేసుకునే బాల్కనీలు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కావు. చాలా తెలివిగా మన ఇంటి భాగాన్ని కట్ చేసి, దానిని బాల్కనీ అని భ్రమింపజేసే వ్యాపార మాయాజాలం అది. ఇక మీరు ఉత్తరం తక్కువ, దక్షిణం ఎక్కువ బాల్కనీ ఉంది భయపడుతున్నారు. వాటికి మీరు వెంటనే ఇనుప గ్రిల్స్ వేయండి. లేదా యూపీవీసీ విండోస్ బిగించండి. తద్వారా ఏ బాల్కనీ దోషం ఉండదు. ఇంటి పారుదాటి ఆరు బయటికి సాగిన స్థలాన్ని (స్లాబును) మాత్రమే బాల్కనీగా భావించాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143