– ఎం. శ్రీదేవి, షాద్నగర్.
చాలాచోట్ల అపార్ట్మెంట్లు నేలమీద పార్కింగ్కే అవకాశం ఇస్తున్నాయి. ఇక ఫ్లోర్లు ఎన్ని అవకాశం ఉంటే అన్ని కడుతున్నారు. వాటికి, వాళ్లకు లెక్కలేదు. అదేమీ గొప్పకాదు. కింద అంటే ఒకటి రెండు ఫ్లోర్లలో ఉండే ఇండ్ల (ఫ్లాట్ల)కు, ఆ పైన ఎనిమిది, పన్నెండు ఇంకా పై అంతస్తులలో ఉండేవాటికి కట్టడం తేడా ఉండదు. కానీ, కంటికి చాలా తేడా కనిపిస్తుంది. కింది వాళ్లకన్నా పైన ఉండే వాళ్లకు కాలం కాస్త నెమ్మదిగా నడిచినట్టు అనిపించినా.. అంత తేడా ఉండదు. కానీ, వ్యూ కోసం అందరూ పైపైన కోరుతుంటారు. అదొక మాయ. కానీ, భూమికి దగ్గరగా.. నాలుగు, ఐదు, ఆరు అంతస్తులలో ఉండటం మంచిది. మనిషి నేలకు దగ్గరగా జీవించడం అవసరం. పసిపిల్లవాడు తనకు తెలియకుండానే తల్లికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. కారణం.. ఆమె అందించే రక్షణ అది. ప్రకృతి ఒడిలో నేలమీద చెట్లు, ఆకులు, సకల జీవుల సందడిలో ఇల్లు ఉండటం వేరు. ఆకాశంలో గాలి సుడుల మధ్య ఉండటం వేరు. ఇష్టాయిష్టాలు వేరు. శాస్త్రం వేరు. పూర్ణ ఆనందం కలిగే స్థలాలు మరీ దూరం కాకుండా మనిషి జీవించాలి. ఎంత ఎత్తో అంత లోతు కూడా అన్నది మరువరాదు.
– దాసం వెంకటయ్య, తొర్రూర్.
ఆ రోడ్డు స్థలాలకు ఒకదానికి పడమర, మరొకదానికి తూర్పు అయినట్లయితే కూడా.. ఆ చోటు పనికిరాదు. లేదా ఆ రోడ్డు ఉత్తర-దక్షిణంగా ఉన్నాకూడా ఆ రెండు వైపుల ఇండ్లకు నష్టం కలిగిస్తుంది. కారణం.. ఆ గుండు (చిన్న గుట్ట) వద్ద రోడ్డు వంపు తిరిగి ఇరువైపులా ఉన్న ఇండ్లకు వీధి పోట్లు తెచ్చిపెడతాయి. పడమరగా గుట్ట ఉంది కదా అని పడమర సింహద్వారం ఇల్లుకు ఒక వైపునుంచి నైరుతి వీధిశూల వస్తుంది. అలాగే తూర్పు ఇంటికి ఆగ్నేయం పోటు వస్తుంది.

అందుకే, రోడ్ల ప్రయాణంలో ఒక్కో చౌరస్తా వద్ద గుండ్రంగా వచ్చే వీధులు తెలియకుండా దోషాలను తెచ్చిపెడతాయి. అలాంటి వాటిని ముందుగానే పసిగట్టి ఎంచుకోవాలి. కొన్ని ప్రాంతాలలో ఈశాన్య బ్లాకు ఉన్నచోట కూడా ఇలాంటి రోడ్ల దోషం వస్తుంది. అవి అంత సులభంగా అర్థం కావు. కాబట్టి, ఇళ్ల ఎంపికను ముందుగానే తెలుసుకొని నిర్దారించుకోవాలి. లేదంటే మనకు జీవితమంతా నష్టాలు కలిగిస్తాయి.
– ఎ. రంగారెడ్డి, బోయిన్పల్లి.
ఇల్లు ప్రధానంగా బాగున్నప్పుడు దోషం ఉండదు. ఇక అనేక ఇండ్ల సముదాయం గ్రామం. అలాంటి ఊరికి కొన్ని సాధారణంగా వర్తిస్తుంటాయి. ఆ నష్టాలు, లేదా లాభాలు సమష్టిగా ఉంటాయి. కొండకింది పల్లెటూరు అనుకుందాం. ఆ కొండ తూర్పులో ఉంది. అలాంటప్పుడు ఆ ప్రభావం ఊరి మొత్తానికి వర్తిస్తుంది.

అలాగే, పడమర వాగు ప్రవాహం ఉండే పల్లె. అక్కడ ఆ పల్లె అంతటికీ దాని ప్రభావం ఉంటుంది. అలా సరిహద్దులు ఊరంతటికీ కొంత నష్టం తెచ్చినా.. ఊరి మధ్యలో ఒక తూర్పు ఇల్లు శాస్త్రబద్ధంగా కట్టుకున్న వారికి ఆ పడమర నది ప్రభావం అస్సలు ఉండదు. ఇలా ఆయా గ్రామాల్లో కొన్ని ఇండ్లు బాగుంటాయి. కానీ, మా ఊరికి డెవలప్మెంట్ లేదు అని కొందరు అంటూ ఉంటారు. అలాంటివి ఇలాగే కొన్ని దోషపూరిత సరిహద్దులతో ఉంటాయి. అందుకే, పల్లెకన్నా ఇల్లు జాగ్రత్తగా నిర్మించుకుంటే.. ఎంతోకొంత సుఖంగా ఉంటాము.
– కె. యాదగిరి, బావుపేట.
స్థలం బాగుంటే ఏదైనా కొనవచ్చు. తూర్పు-పడమర స్థలాలు బాగుంటాయి. వాటిలో వచ్చే అవకతవకలు పురుషుల మీద ప్రభావాన్ని కలిగిస్తాయి. అలాగే, వాటికి ఉండే ఉత్తమ లక్షణాలు పురుషుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. తూర్పు స్థలం ఉదయించే సూర్యునికి గొప్ప మిత్రునిగా ఉంటుంది. పడమర స్థలం అస్తమించే సూర్యునికి ఆప్తునిగా ఉంటుంది. ప్రధానంగా తూర్పు వీధి, పశ్చిమం వీధి, ఇండ్లు అధిక వెలుగు, గాలులకు నిలయంగా ఉంటాయి.

వీటిల్లో.. స్థలంలోని దోషాలు, వాటి గుణ-గణాలలో మార్పులు, అవి దిశకు ఉన్న విధానం, వాటి భౌతిక లక్షణాలను బట్టి ఒక్కోసారి పడమర స్థలం తూర్పు కన్నా చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా నిర్ధారించాలి అంటే, వాటిని లోతుగా పరీక్షించాల్సి వస్తుంది. అంతేకానీ, తూర్పు అనగానే అది కేవలం గొప్పది అనుకోవద్దు. పడమర పనికిరానిది కాదు. మంత్రి పోస్టు గొప్పది కావచ్చు. మంత్రి మంచివాడు అనే గ్యారెంటీ లేదుకదా!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143