Worlds Oldest Cat | ప్రపంచంలో పెద్ద వయసు పిల్లి.. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన దీని వయసు ఎంతంటే..?
ఒక పిల్లి 27 ఏళ్లు బతకడం అనేది మనిషి 120 ఏళ్లు బతికిన కాలంతో సమానం
Worlds Oldest Cat : మామూలుగా పిల్లుల జీవితకాలం 13 నుంచి 18 ఏళ్లు. కానీ, ఈ పిల్లి మాత్రం జీవితకాలం దాటినా కూడా బతికే ఉంది. ప్రస్తుతం ఈ పిల్లి వయసు 26 ఏళ్లు. దాంతో, ప్రపంచంలో బతికి ఉన్న ఎక్కువ వయసు పిల్లిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 26 ఏళ్ల 329 రోజుల వయసు ఉన్న ఈ పిల్లి మరికొద్ది రోజుల్లో 27వ పుట్టిన రోజు జరుపుకోనుంది. ఒక పిల్లి 27 ఏళ్లు బతకడం అనేది దాదాపు మనిషి 120 ఏళ్లు బతికిన కాలంతో సమానం అంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. గిన్నిస్ రికార్డు సాధించిన ఈ పిల్లి పేరు ఫ్లోసీ. ఈ పిల్లి ఫొటోల్ని గిన్నిస్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. దాంతో, ఫ్లోసీ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
గోధుమ, నలుపు రంగులో ఉన్న ఫ్లోసీని ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన విక్కీ గ్రీన్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఫ్లోసీ 26 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉంటుందని, చక్కగా ఆడుకుంటుందని విక్కీ తెలిపాడు. అంతేకాదు పూర్తి ఆరోగ్యంగా ఉందని కాకపోతే చూపు, వినికిడి శక్తి తగ్గాయని చెప్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన టిఫానీ టూ అనే పిల్లి పేరు మీద ఉండేది.
1995లో మెర్సెయ్సైడ్ ఆస్పత్రి పరిసరాల్లో కనిపించిన ఫ్లోసీను ఒక వర్కర్ పెంచుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడు. పదేళ్ల తర్వాత అతను చనిపోవడంతో అతని చెల్లెలు ఫ్లోసి బాధ్యత తీసుకుంది. అలా ఇప్పటివరకూ చాలామంది యజమానుల దగ్గర పెరిగింది.
New record: Oldest living cat – Flossie aged 26 years and 329 days 😸
She’s the human equivalent of 120 years old! https://t.co/4dyGE4L0nV pic.twitter.com/JJd9gXSKmV
— Guinness World Records (@GWR) November 23, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

