గుడ్లగూబలను మనదగ్గర అశుభంగా భావిస్తారు. అవి ఇంటి పరిసరాల్లో కనిపిస్తే భయపడిపోతారు. హార్రర్ సినిమాల్లో వాటిని భయంకరంగా చూపిస్తుంటారు. కాగా, ఓ గుడ్లగూబ తన తలను గుండ్రంగా తిప్పి నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూస్తే తమ తల తిరిగిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
గుడ్లగూబలు కళ్లు తిప్పలేవు. అందుకే చుట్టుపక్కల చూడాలంటే మెడను గుండ్రంగా తిప్పుతాయి. 360 డిగ్రీలు తిప్పినట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ, అవి 270 డిగ్రీలు మాత్రమే తలను తిప్పగలవు. ఓ క్యూట్ గుడ్లగూబ తలతిప్పే వీడియోను అమేజింగ్ నేచర్ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్చేయగా, వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 228కే వ్యూస్ వచ్చాయి.
Cute. 💚❤💙 pic.twitter.com/MJvrMkchgi
— Amazing Nature (@AmazingNature00) April 6, 2022