viral video: సంగీతం వింటూ మైమరచిపోయిన జింకలు
వయోలిన్ వాయిస్తుంటే ఆసక్తిగా విన్న జింకలు
సంగీతానికి రాళ్లను కూడా కదిలించగల శక్తి ఉందంటారు. మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా ఇష్టపడతాయి. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ. ఈ వీడియోలో ఒకామె వయోలిన్ మీద సంగీతం పలికిస్తుంటే అటుగా వెళ్తున్న రెండు జింకలు మైమరిచిపోయి ఆసక్తిగా వింటున్నాయి. స్పెయిన్కి చెందిన ఈమె పేరు డయానా. అడవి మధ్యలో కుర్చీలో కూర్చొని జర్మనీకి చెందిన సంగీతకారుడు జొహన్ సెబాస్టియన్ బాచ్ సంగీతాన్ని వయోలిన్ మీద పలికించింది. ఆమె లయబద్ధంగా వయోలిన్ వాయిస్తుంటే, రెండు జింకలు ఆసక్తిగా వినడమే కాకుండా నెమ్మదిగా ఆమెకు దగ్గరగా వచ్చాయి. డయానా వాటిని చూసి బెదరకుండా అలానే కూర్చొని వయోలిన్ వాయించింది.
అడవిలో వయోలిన్ వాయిస్తున్న ఫొటోలు, వీడియోను డయానా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది డయానా. ‘వయోలిన్ పట్టుకొని అడవికి వెళ్లి, అక్కడ జొహన్ సెబాస్టియన్ సంగీతాన్ని పలికిస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి’ అనే క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోను డార్థ్ అర్రెంకే అనే రెడ్డిట్ యూజర్ ఈమధ్యే సోషల్మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో 96 వేల మందికి పైగా చూశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

