Viral pic: అది ఏలియన్స్ వాహనమా? లేక రష్యా ఆయుధమా?..భయంగుప్పిట అమెరికన్లు!!
అలస్కాలోని ఓ పర్వతంపై ఓ వింత ఆకారం అమెరికన్లను భయపెట్టింది. ఓ కొండపై కనిపించిన ఈ ఆకారం ఫొటో సోషల్మీడియాలో చక్కర్లు కొట్టింది. అది ఏలియన్స్ వాహనం అని కొందరు..ఉల్కాపాతం అని మరికొందరు ఊహించారు.
అలస్కాలోని ఓ పర్వతంపై ఓ వింత ఆకారం అమెరికన్లను భయపెట్టింది. ఓ కొండపై కనిపించిన ఈ ఆకారం ఫొటో సోషల్మీడియాలో చక్కర్లు కొట్టింది. అది ఏలియన్స్ వాహనం అని కొందరు..ఉల్కాపాతం అని మరికొందరు ఊహించారు. మరికొందరు ఓ ముందడుగేసి రష్యా ప్రయోగించిన ఆయుధమని పేర్కొన్నారు. ఈ ఫొటో అమెరికాలో కలకలం రేపింది.
అమెరికాలోని అలస్కాలోగల ఓ పర్వతంపై ఈ వింత ఆకారం కనిపించింది. అది కనిపించగానే స్థానికులు ఫొటో తీసి, సోషల్మీడియాలో పెట్టారు. ఈ ఫొటో ప్రజల్లో భయాన్ని పెంచడంతో, అమెరికా అధికారులు రంగంలోకి దిగారు. ఓ హెలికాప్టర్ వేసుకుని అలస్కా స్టేట్ ట్రూపర్స్ ఆ కొండచుట్టూ చక్కర్లు కొట్టారు. ఆ ప్రాంతంలో ఏమీ కనిపించలేదని, ఆ వింత ఆకారం మేఘమని తేల్చారు. అప్పుడప్పుడూ ప్రకృతిలో జరిగే పలు చర్యలవల్ల మేఘాలు వింతగా కనిపిస్తాయని చెప్పారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన పనిలేదని అలస్కా స్టేట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Aliens
- strange cloud
- UFO
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

