బాలీవుడ్లో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు టైగర్ ష్రాఫ్.. జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్ ఆకట్టుకునే డ్యాన్స్, నటనతోపాటు తన శరీర సౌష్టవంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతడు ఇన్‌స్టాలో పెట్టే వర్కౌట్స్ వీడియోలతో ఎంతోమంది యువత మోటివేట్ అవుతుంటారు.
తాజాగా, 32 ఏళ్ల ఈ హీరో కెటిల్‌బెల్ వర్కౌట్ వీడియోను ఇన్‌స్టాలో పెట్టాడు. అద్దంలో తన వీపు కనిపించేలా 60 కేజీల డంబెల్స్‌తో ఈ వర్కౌట్ చేశాడు. రోజు విడిచి రోజు కెటిల్ బెల్ వర్కౌట్స్ చేస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.