Viral Video: కదులుతున్న రైలుపై… ప్రమాదకరంగా స్టంట్లు
వాషింగ్టన్: కదులుతున్న రైలుపై కొందరు వ్యక్తులు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక లోకల్ రైలు విలియమ్స్బర్గ్ వంతెనపై వెళ్తున్నది. కాగా, 8 మంది వ్యక్తులు ఆ రైలు బోగీలపైన ఉన్నారు. ముగ్గురు దానిపై పరుగెత్తగా, మరో వ్యక్తి స్కిపింగ్ చేశాడు. మరి కొందరు రైలు బోగి టాప్‌పై ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా నిల్చొని ఉండగా, ఒకరిద్దరు కూర్చొని ఉన్నారు. కాగా, ఆ రైలు విలియమ్స్బర్గ్ వంతెనపై వెళ్తున్నప్పుడు సమీపంలోని ఎత్తైన బిల్డింగ్ నుంచి ఒకరు ఈ వీడియో తీశారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్షలాది మంది దీనిని చూశారు. ఆ వ్యక్తుల ప్రమాదకర స్టంట్లను కొందరు విమర్శించారు. 1980లో రైలు పైన ప్రయాణించడం అమెరికాలో కామన్ అని ఒకరు గుర్తు చేశారు. పెట్రోల్ రేట్లు పెరుగుతుండటంతో ఇలాంటి సాహసాలు ఇంకా ఎన్ని చూడాలో అన్ని ఒకరు చమత్కరించారు.
కాగా, ఈ వీడియో తమ దృష్టికి వచ్చినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. వీడియో చాలా దూరం నుంచి రికార్డ్ చేయడంతో అందులోని వ్యక్తులను గుర్తించడం కష్టంగా ఉందన్నారు. అయితే నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా రైలుపై ప్రయాణించిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి వాటిని తాము సహించబోమని హెచ్చరించారు.
Another view! pic.twitter.com/ejil5xrLLu
— 𝔎𝔞𝔯𝔞 ☻ (@karasmarsh) June 11, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

