వైరల్ వీడియో : ఆవును కొడితే లేగదూడ రియాక్షన్ మామూలుగా లేదుగా..!
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్గా మారుతున్నాయి.
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్గా మారుతున్నాయి. సాధు జంతువులను కంటికి రెప్పలా కాపాడుకునే వారు మూగజీవాలకు ఆసరాగా నిలస్తున్న వీడియోలూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశంసలకూ నోటుకుంటున్నాయి.
https://twitter.com/TheFigen/status/1554887024351580160
మరోవైపు జంతువులను క్రూరంగా హింసించే ప్రబుద్ధులపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ తరహా వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్గా మారింది.సూటూ బూటూ వేసుకున్న ఓ వ్యక్తి ఆవులను తోలుతూ వాటి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కర్రతో కొడుతూ హింసిస్తుండగా ఓ లేగదూడకు చిర్రెత్తుకొచ్చిందో ఏమో ఒక్కసారిగా ఎగిరి అతడి గుండెలపై తన్నింది.
లేగదూడ విరుచుకుపడటంతో కంగుతిన్న సదరు వ్యక్తి దాని దెబ్బకు కిందపడటంతో స్టైలిష్ కోటుకు కాస్తా బురుద అంటుకుంది. ఫిజెన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా ఏకంగా 37 లక్షల వ్యూస్ వచ్చాయి. పెద్దసంఖ్యలో నెటిజన్లు లైకులు కొడుతూ రీట్వీట్లు చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఇది తెగవైరలవుతోంది. వేషధారణ కాదు మూగజీవాల పట్ల ఆదరణ ఉండాలని అతడికి నెటిజన్లు గడ్డిపెడుతున్నారు. ఈ తింగరోడికి ఇలా శాస్తి జరగాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

