బాలీవుడ్ నటి దిశాపటానీ యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)తోపాటు ఆత్మరక్షణ విద్య అయిన కిక్ బాక్సింగ్‌లోనూ ఆరితేరింది. ఇందుకు సంబంధించిన వీడియోలను తరుచూ ఇన్‌స్టాలో పెడుతూ ఉంటుంది. తాజాగా, ఆమె పెట్టిన కిక్‌బాక్సింగ్ వీడియో వైరల్ అయ్యింది. స్లో మోషన్లో వచ్చి ట్రిపుల్ కిక్స్ ఇచ్చే వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె ఫాలోవర్స్ అందరూ కిక్బాక్సింగ్పై ఆసక్తిచూపుతున్నారు.
కిక్‌బాక్సింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు..
కిక్‌బాక్సింగ్ అనేది అనేక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన ఫిట్నెస్ వర్కౌట్. శక్తిని పెంపొందిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల అధిక కెలోరీలు బర్న్ చేయొచ్చు. కిక్‌బాక్సింగ్ చేయడం వల్ల సరైన శరీరాకృతి సొంతమవుతుంది. గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో బాగా పనిచేస్తుంది.
వారానికి మూడురోజులు ఒక గంటపాటు సాధన చేస్తే ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గుండె బలోపేతమవుతుంది. వీటితోపాటు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాగా నిద్రపడుతుంది.