టీ స్టాల్ ప్రారంభించి.. కలను సాకారం చేసుకున్న బీటెక్ విద్యార్థిని!
Chai Business | ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ పట్టభద్రులు. సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఉద్యోగాలు చేయాల్సినవాళ్లు. కానీ కొలువులను కాదనుకుని, మంచి సెంటర్ చూసుకొని ‘చాయ్ బిజినెస్’ ప్రారంభిస్తున్నారు. ‘బీటెక్ చాయ్’, ‘చాయ్ పాయింట్’, ‘ఎంబీఏ చాయ్‌వాలా’, ‘చాయ్ మేకర్స్’ ఇలా రకరకాల పేర్లతో ఔట్లెట్స్ తెరుస్తున్నారు.
Chai Business | ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ పట్టభద్రులు. సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఉద్యోగాలు చేయాల్సినవాళ్లు. కానీ కొలువులను కాదనుకుని, మంచి సెంటర్ చూసుకొని ‘చాయ్ బిజినెస్’ ప్రారంభిస్తున్నారు. ‘బీటెక్ చాయ్’, ‘చాయ్ పాయింట్’, ‘ఎంబీఏ చాయ్‌వాలా’, ‘చాయ్ మేకర్స్’ ఇలా రకరకాల పేర్లతో ఔట్లెట్స్ తెరుస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని కూడా ఇదే తరహాలో టీ స్టాల్‌ను ప్రారంభించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
బీహార్‌కు చెందిన వర్తికా సింగ్ అనే యువతి బీటెక్ చదువుతోంది. కానీ ఆమె కల మాత్రం టీ స్టాల్ పెట్టుకోవడమే. బీటెక్ పూర్తి చేసి.. జాబ్ కోసం ఎదురు చూసేంత ఓపిక ఆమెకు లేదు. దీంతో చదువుతూనే.. తన కల సాకారం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ ప్రాంతంలో ‘బీ టెక్ చాయ్ వాలీ’ పేరుతో స్టార్టప్ మొదలు పెట్టి తన కలను సాకారం చేసుకుంది. ఈ టీ స్టాల్లో రకరకాల చాయ్‌లను తక్కువ ధరలకే ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టాల్ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
ఇందుకు సంబంధించిన వీడియోను swagsedoctorofficial ఇన్‌స్టా గ్రామ్ పేజీలో పోస్టు చేశారు. వర్తికా సింగ్ వద్ద టీ చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపారు. మాసాలా అండ్ లెమన్ టీ అందుబాటులో ఉంటుందని… రెగ్యులర్ టీ రూ.10, స్పెషల్ టీ రూ.20కి విక్రయిస్తున్నట్లు వివరించారు. ఇది చూసిన నెటిజన్లు వర్తికాను ప్రశంసిస్తున్నారు.‘‘ మీ పట్టుదల నచ్చింది.. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’’.. ‘‘బీ టెక్ చాయ్ వాలీ’ సక్సెస్ అవ్వాలి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

