వివాహానికి బానిసైన మహిళ.. 52 ఏండ్లలో 12వ పెండ్లికి సిద్ధం

వాషింగ్టన్: మనుషులు పలు వ్యసనాలకు బానిసవుతుంటారు. అయితే విచిత్రంగా ఒక మహిళ వివాహాలకు బానిసైంది. ఆమె ఇప్పటి వరకు 11 పెళ్లిళ్లు చేసుకున్నది. 52 ఏండ్ల వయసులో మరో వివాహానికి సిద్ధమంటున్నది. అమెరికాలోని ఉటాకు చెందిన మోనెట్ డయాస్ ఇటీవల టీఎల్సీ షో అడిక్ట్డ్ టు మ్యారేజ్‌లో కనిపించింది. 50 ఏండ్లపైబడిన ఆమె ఇప్పటి వరకు 11 సార్లు వివాహం చేసుకున్నట్లు తెలిపింది. 12వ పెండ్లి కూడా చేసుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పింది.
తనకు ‘అబ్బాయిలంటే పిచ్చి’ అని డయాస్ వర్ణించింది. రెండేండ్ల వయసులోనే తొలిసారి ప్రేమలో పడినట్లు తెలిపింది. ‘నేను త్వరగా ప్రేమలో పడతాను. అన్ని కలిపితే, 28 సార్లు నాకు ప్రపోజ్ చేశారని అనుకుంటున్నాను’ అని చెప్పింది. పెళ్లి, భర్త గురించి ఎప్పుడూ ఊహల్లో విహరిస్తానని అన్నది. తాను ఎప్పుడూ ప్రేమలో ఉంటానని, భర్తతో కుదరనప్పుడు తన కలల సినిమాకి సరిపోయేలా మరొక నటుడి కోసం వెతుకుతానని తెలిపింది. ఇలా తనకు చాలా మంది భర్తలున్నారని, తాను పెండ్లి చేసుకున్న పురుషులందరినీ ట్రాక్ చేయడంలో తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుంటారని ఆమె చెప్పింది.
కాగా, అనేకసార్లు పెండ్లి చేసుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నదని మోనెట్ డయాస్ తెలిపింది. తన క్రైస్తవ విశ్వాసం కారణంగా, పెండ్లి కాకుండా సంభోగంలో పాల్గొనడం తప్పన్న నమ్మకంలో తాను పెరిగినట్లు ఆమె చెప్పింది. ‘నేను ఒక వ్యక్తితో కొన్ని నెలలు డేటింగ్ చేస్తాను. ఆయన అంటే ఇష్టం ఉండి సెక్స్ చేయలేనప్పుడు.. ఓహ్, మనం పెళ్లి చేసుకుందాం’ అని చెబుతానని న్యూయార్క్ పోస్ట్‌తో ఆమె అన్నారు.
మరోవైపు, తన అతి చిన్న వివాహం కేవలం ఆరు వారాల పాటు కొనసాగిందని, దీర్ఘకాల వివాహ బంధం పదేండ్లు సాగిందని మోనెట్ డయాస్ తెలిపింది. ఇన్ని వివాహాలు చేసుకున్నప్పటికీ ఒక వ్యక్తితో ప్రేమను వదులుకోలేకపోయానని, తన కలల రారాజు 57 ఏండ్ల జాన్ అని ఆమె చెప్పింది. అతడిని రెండుసార్లు వివాహం చేసుకుని రెండుసార్లు విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది.
Can you name all of your sister's ex-husbands?
— TLC Network (@TLC) November 17, 2021
Marcie: …. 😂 #AddictedToMarriage pic.twitter.com/RLI26GAcpH
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

