ధూళి ఎక్కువైతే కొవిడ్ కేసులూ ఎక్కువే!
- కాలుష్యానికి, అంటువ్యాధులకు మధ్య బలమైన సంబంధం
- దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): గాలిలో ధూళి కణాలు (పార్టికల్స్ మ్యాటర్) అధిక మోతాదులో ఉన్న నగరాల్లో జీవించేవారికి కొవిడ్ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఉత్కల్ యూనివర్సిటీ (భువనేశ్వర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలాజీ (పుణె), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (రూర్కెలా), ఐఐటీ-భవనేశ్వర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 721 జిల్లాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో పీఎం 2.5 లెవల్స్‌కు, కొవిడ్ లాంటి అంటువ్యాధులకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తేలింది. పీఎం లెవల్స్ అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటక, ఒడిశాలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ముఖ్యంగా శిలాజ ఇంధన కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లోనే కొవిడ్ కేసులు, మరణాలు ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
అధ్యయన వివరాలు
- ఢిల్లీలో ఏడాదికి సగటున 288 రోజులు గాలిలో నాణ్యత బాగుండదు. ఆ సమయంలోనే 4,38,529 కరోనా వైరస్ కేసులు నమోదవగా.. అనారోగ్యంతో 6,989 మంది మరణించారు.
- ముంబైలో ఏడాదికి సగటున 165 రోజులు గాలిలో నాణ్యత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో 2,64,545 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 10,445 మంది మరణించారు.
- పుణెలో ఏడాదికి సగటున 117 రోజులు గాలిలో నాణ్యత తక్కువ. ఆ రోజుల్లో 3,38,583 కరోనా కేసులు, 7,060 మరణాలు నమోదయ్యాయి.
- శ్రీనగర్‌లో గాలి నాణ్యత తక్కువగా ఉన్న 145 రోజుల్లో 20,413 కొవిడ్ కేసులు, 375 మరణాలు నమోదయ్యాయి.
- బెంగళూరులో ఏడాదికి సగటున 39 రోజుల్లోనే గాలిలో నాణ్యత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అక్కడ 3,65,959 కరోనా కేసులు, 4,086 మరణాలు నమోదయ్యాయి.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

