అలరించిన సంగీత ‘రాగావధానం’

హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్ నిర్వహించిన ‘రాగావధానం’ కార్యక్రమం అలరించింది. ఆదివారం అంతర్జాలంలో 5 గంటలపాటు వినూత్నంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం సంగీత ప్రియులను కట్టిపడేసింది. గరికిపాటి వెంకట ప్రభాకర్, పద్మ లలిత దంపతులు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, భారతదేశం నుంచి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు జీ ఆనంద్, ప్రఖ్యాత గాయని సురేఖమూర్తి తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సాహిత్య అష్టావధాన ప్రక్రియలోలాగే సింగపూర్ నుంచి గాయనీ గాయకులు విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్యలక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్ పృచ్ఛకులుగా వ్యవహరించగా, రాధిక మంగిపూడి సమన్వయకర్తగా వ్యవహరించారు. అమెరికా, హాంగ్‌కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే తదితర దేశాల్లో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

