చీరలో మెరిసిపోతున్న చిరంజీవి ముద్దుల కూతుళ్లు

ఫోటో చూసిన తర్వాత ఇప్పుడు ఇదే అనిపిస్తుంది కదా. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. అయితే వారసులు కాదు వారసురాళ్లు కూడా సత్తా చూపిస్తున్నారు. కాకపోతే వాళ్లు తెరపై కాకుండా తెరవెనక తమ బ్రాండ్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరు ఇంట్లో ప్రతీ పండగ ఓ రేంజ్లో జరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వాళ్లకు అలవాటు. ఇప్పుడు శివరాత్రి కూడా ఇలాగే జరుగుతుంది. తాజాగా కొడుకు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లతో కలిసి చిరంజీవి శివరాత్రిని జరుపుకున్నాడు.
ఈ క్రమంలోనే చిరు తనయలు ఇద్దరూ మంచి చీర కట్టుకుని.. సాంప్రదాయబద్ధంగా ముస్తాబై ఫోటోలు పోస్ట్ చేశారు. అందులో చీరతో పాటు షేడ్స్ పెట్టుకుని సుష్మిత, శ్రీజ చాలా చక్కగా ఉన్నారు. ఫోటోల సంగతి పక్కనబెడితే ఈ ఇద్దరూ సినిమాల్లో కూడా తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే చిరు పెద్ద కూతురు సుష్మిత క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా బిజీ అయిపోయింది. ఖైదీ నెం 150 సహా సైరా లాంటి సినిమాలకు ఈమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. తమ్ముడు రామ్ చరణ్ సినిమాలకు కూడా పని చేస్తుంది సుష్మిత. ఇప్పటికే ఈమెకు స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరొచ్చింది. బయటి సినిమాలకు కూడా చేయాలంటూ ఆఫర్స్ వస్తున్నా ఇంటికే పరిమితమైంది సుష్మిత.

ఈ మధ్యే షూటౌట్ ఎట్ ఆలేరుతో తొలిసారి వెబ్ సిరీస్‌కు నిర్మాతగా మారింది. మరోవైపు చిరు చిన్నకూతురు శ్రీజ సైతం నిర్మాతగా మారుతుంది. భర్తతోనే సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతుంది. సినిమాలు అలా ఉంచితే ఈ అక్కాచెల్లెళ్ల అనుబంధం రియల్ లైఫ్‌లో అద్భుతంగా ఉంటుంది. పండుగలు కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ మెగా డాటర్స్ ఇద్దరూ ఫోటోలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే చేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయ బద్ధంగా జరుపుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్న తర్వాత ఇలాంటి లుక్ పోస్ట్ చేశారు. చీరలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

