ముగ్గురిలో ఇద్దరు ఆన్లైన్ బానిసలే
- కరోనా సమయంలో పెరిగిన వినియోగం
- రోజుకు అదనంగా 4 గంటలు ఆన్లైన్లోనే 82 శాతం మంది
- నార్తన్ లైఫ్ లాక్ సైబర్ సేప్టీ సర్వే

హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి ప్రజల జీవనశైలిలో అనేక మా ర్పులు తెచ్చింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడంతో అధికశాతం మంది స్మార్ట్ఫోన్లకు బానిస అయ్యారు. భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్లైన్లోనే గడుపుతున్నారు. నార్తన్ లైఫ్ లాక్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సైబర్ సేప్టీ సర్వేలో భారత్ నుంచి పాల్గొన్నవారిలో 66 శాతం మంది ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పని, చదువు కోసం కాకుండా రోజుకు అదనంగా 4.4 గంటలు ఆన్లైన్లో గడుపుతున్నామని 82 శాతం మంది అంగీకరించారు. ఇంట్లో ఉండేవారి ఆన్లైన్ ప్రవర్తనపై ఈ సర్వే నిర్వహించింది. భారత్ నుంచి వెయ్యి మందికిపైగా పాల్గొన్న సర్వేలో ప్రతి 10 మందిలో 8 మంది పని, చదువు కోసం కాకుండా ఇతర పనుల కోసం అదనంగా ఆన్లైన్లో ఉంటున్నామని తెలిపారు. ఈ కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బతిన్నదని 74 శాతం మంది, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని 55 శాతం మంది చెప్పారు. మొత్తంగా 76 శాతం మంది ఆన్లైన్లో ఉండే సమయాన్ని తగ్గించుకునేందుకు బయటికి వెళ్త్తున్నామని, స్నేహితులతో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు
- స్మార్ట్ హోం డివైజ్‌లు (ఇంటర్నెట్తో ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసే పరికరాలు), వాటిని తయారుచేసే సంస్థలపై తమకు విశ్వాసం లేదని చాలామంది చెప్పారు.
- స్మార్ట్‌హోం పరికరాల భద్రతపై 48% మంది, 40%మంది గోప్యతపై ఆందోళన వ్యక్తంచేశారు.
- ఈ పరికరాలకు సంబంధించి సరైన సమాచారం లేక కొనట్లేదని 40 %, సేకరించిన వినియోగదారుల సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారో తయారీసంస్థలు చెప్పని కారణంగా కొనడం లేదని 35 % మంది చెప్పారు.
- ప్రతి ఐదుగురిలో నలుగురు వ్యక్తిగత సమాచారాన్నే పాస్‌వర్డ్‌లా వాడుతున్నామన్నారు. పేరు, పుట్టిన తేదీ, భార్య లేదా పిల్లల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టేవారు 82 శాతం కాగా.. పేరును పాస్‌వర్డ్‌గా 69 శాతం మంది. పుట్టిన తేదీని 58 శాతం మంది పాస్‌వర్డ్‌గా వాడుతున్నారు.
- వైఫై రూటర్ ఉన్నవారిలో 72 శాతం మంది ఏడాదికి ఒకసారైనా పాస్‌వర్డ్‌ను మారుస్తున్నా రు. 26శాతం నెలకు ఒకసారి మారుస్తుంటే 9 శాతం మాత్రం పాస్‌వర్డ్‌ను మార్చడం లేదు.
- సర్వేలో పాల్గొన్న 84 శాతం మంది తమ పిల్లలతో ఇప్పటివరకు సైబర్సేప్టీ గురించి మాట్లాడలేదని చెప్పారు. ఆన్లైన్లో ఉండే తమ పిల్లలకు రక్షణ కల్పించడం కష్టమని 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లలకు సైబర్పేప్టీ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని 80 శాతం మంది చెప్పారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
- Tags
- corona
- Internet Usage
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

