29-04-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
రాశి ఫలాలు| మేషం: అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

మేషం: అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
వృషభం: కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
మిథునం: ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
కర్కాటకం: విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
సింహం: బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య: ఆర్థిక ఇబ్బందు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంగంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
తుల: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
వృశ్చికం: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.
ధనుస్సు: బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
మకరం: శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
కుంభం: బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
మీనం: అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెల్లకూడదు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

