ఎస్సారెస్పీ ఫుల్
- ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
- పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
- గురువారం రాత్రి 1090.30 అడుగులకు చేరిక
- ఏడు గేట్లు ఎత్తి 21,840 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల

హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/ మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతున్నది. ప్రాజెక్టు దాదాపు నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.31 టీఎంసీలు) కాగా.. గురువారం రాత్రి 9.30 గంటలకు నీటిమట్టం 1090.30 అడుగుల (86.5 టీఎంసీల)కు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాలనుంచి వరద పెరగడంతో ఈఈ చక్రపాణి ఆధ్వర్యంలో ఏడు గేట్లు ఎత్తారు. 21,840 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఉదయం నుంచి ప్రాజెక్టులోకి 39 వేల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రికి అది 61,600 క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నదని చక్రపాణి చెప్పారు.
గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడెం ప్రాజెక్టులోకి 55 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో గేట్లు ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులకూ స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతున్నది.

Read Today's Latest Topstories News in Telugu and Telugu News
- Tags
- Sriram Sagar Dam
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

