ఆ ఫైల్స్ ఎక్కడ?
- దేవరయాంజాల్ భూముల దస్ర్తాలు మాయం!
- దాదాపు 40 ఫైళ్లు కన్పించటం లేదని గుసగుస
- విచారణ అధికారులు ఎప్పుడేం అడుగుతారో
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎండోమెంట్ అధికారులు
ఏ: ఆ ఫైల్స్ గురించి ఇప్పుడు అడుగుతారేంటి సార్.. నేను మీకు చార్జి ఇచ్చినప్పుడే హ్యాండోవర్ చేసిన.
బీ: వామ్మో.. నాకు తెలియదు సార్.
ఏ: ఓ పని చేయండి సర్.. విచారణ అధికారులు పాతవి అడిగితే ‘డెస్ట్రాయ్’ అని చెప్పండి. కొత్తవి అడిగితే కమిషనర్ ఆఫీస్ లేదంటే సర్వే భవన్ పేర్లు చెప్పండి.. మీరు సేఫ్ అంతే.
బీ: మీరు ఉన్నప్పటి నుంచే కనిపిస్తలేవట. విచారణ అధికారులు ఆ ఫైల్స్ వివరాలు అడిగితే మీ పేరే చెప్తా.
ఏ: వామ్మో నన్ను వివాదాల్లోకి లాగవద్దు సర్. మీకు అన్ని ఫైల్స్ హ్యాండోవర్ చేసిన.

ఇవీ.. దేవరయాంజాల్ భూములకు సంబంధించి పత్రాలు, ఫైళ్లపై ఎండోమెంట్ అధికారుల మధ్య జరుగుతున్న వాదోపవాదాలు. ఆ భూములకు సంబంధించి 40 వరకు ఫైళ్లు కన్పించటం లేదని చర్చ నడుస్తున్నది. ఈ ఫైల్స్‌పై అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకొంటున్నట్టు తెలుస్తున్నది. మీరు ఇక్కడ ఉన్నపుడే పోయాయని ఒకరంటే, మీరు చార్జి తీసుకొన్న తర్వాతే పోయి ఉంటాయని మరొకరు వాదులాడుకొంటున్నట్టు వినికిడి. రిటైర్డ్ అధికారులపై ఈ ఫైళ్ల వ్యవహారాన్ని నెట్టేయాలా? గతంలోనే డెస్ట్రాయ్ చేశారని చెప్పాలా? ఎవరు తీసుకొన్నారో, ఎక్కడ పెట్టారో గానీ నాకొచ్చిందీ కష్టం అని కొందరు అధికారులు తలలు పట్టుకొంటున్నట్టు సమాచారం.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ భూముల అన్యాక్రాంతంపై రోజుకో కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తున్నది. దేవాలయం, భూములకు సంబంధించి 40 దాకా ఫైళ్లు కనిపించకుండా పోయినట్టు చర్చ నడుస్తున్నది. గతంలో ఆ ఫైళ్ల వ్యవహారం చూసిన అధికారులు ఎప్పుడేం జరుగుతుందోనని వేరొకరిపై నిందలు వేసే పనిలో పడ్డట్టు తెలుస్తున్నది. ఈ భూములపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాలతో వెంటనే స్పందించిన ప్రభుత్వం నలగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా దేవాలయ పుట్టుపూర్వోత్తరాల దగ్గర నుంచి దేవాలయ భూములు, అన్యాక్రాంతం వరకు జరిగిన వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండోమెంట్ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కొంతమంది ఉన్నతాధికారులతోపాటు శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ ఈవోగా పనిచేసిన అధికారుల వరకు ఈ ఫైళ్ల బాగోతంపై పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇప్పుడు వీరిలో కొందరు అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండటంతో నిజాయితీ ఆఫీసర్లు, కిందిస్థాయి అధికారులు నవ్వుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
విచారణలో అడిగితే ఏం చేద్దాం?
ఈ ఫైళ్ల విషయంలో విచారణ అధికారులు అడిగితే ఏం చేద్దామని దేవాదాయశాఖలో చర్చ హాట్‌హాట్‌గా సాగుతున్నట్టు వినికిడి. ‘ఆ రఘునందన్‌రావు అన్ని వివరాలు అడుగుతాడట. కొంపదీసి మన దగ్గర కనిపించకుండా పోయిన ఆ ఫైళ్లను అడుగుతాడేమో. అవి ఎవరు తీసుకున్నారో, ఎక్కడ పెట్టారో కానీ ఇప్పుడు నాకొచ్చింది కష్టం’ అంటూ ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు అధికారులు తోటి అధికారుల వద్ద గోడు చెప్పుకుంటున్నారట. ముఖ్యంగా ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్నవారికి ముచ్చెమటలు పడుతున్నట్టు సమాచారం. ఇక్కడ గతంలో పనిచేసి ఏపీ వెళ్లిన, రిటైర్డ్ అధికారులపై ఈ ఫైళ్ల వ్యవహారం నెట్టేయాలా? గతంలోనే డెస్ట్రాయ్ చేశారని చెప్పాలా? అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. గతంలోనే ఒక మాజీ మంత్రితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేతల ఒత్తిడి కారణంగా ఈ ఫైళ్లను అధికారులు తొక్కిపెట్టారని, సమాచార హక్కు చట్టం కింద కొంతమంది సామాజిక కార్యకర్తలు వివరాలు అడిగినా సమాచారం ఇవ్వలేదని కొందరు అధికారులు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
దేవరయాంజాల్ దేవాలయం, భూములకు సంబంధించి కనిపించటం లేదని భావిస్తున్న ఫైళ్ల వివరాలు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో..
1.ఫైల్ నంబర్ ఎం4/18316/2003
- ఫైల్ నంబర్ డీ2/70399/1982
- ఫైల్ నంబర్ సీ2/12762/2016
- ఫైల్ నంబర్ సీ1/8970/2016
- ఫైల్ నంబర్ డీ4/3593/1993
ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో..
- ఫైల్ ఆర్సీ నంబర్ సీ1/1027/2003
- ఫైల్ ఆర్సీ నంబర్ సీ/1703/1983
- ఫైల్ ఆర్సీ నంబర్ సీ/2523/1996
- ఫైల్ నంబర్ సీ/457/1999
- ఫైల్ నంబర్ సీ/1992/2002
- ఫైల్ నంబర్ సీ/744/2000
- ఫైల్ నంబర్ సీ/2797/1999
ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో..
ఫైల్ నంబర్ ఏ2/11184/1990
ఫైల్ ఓఏఎన్ నంబర్లు 56-107 ఆఫ్ 1999 వరకు (భూముల ఆక్రమణలకు సంబంధించి వీటిపై కేసులు కూడా నడిచాయి)
రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో..
ఎ) ఫైల్ నంబర్ బీ1/11923/1990
బీ) ఫైల్ నంబర్ జీ1/7255/1994
సీ) ఫైల్ నంబర్ బీ3/6384/1995
డీ) ఫైల్ నంబర్ బీ3/755/1996
ఈ) ఫైల్ నంబర్ బీ1/7226/1996
ఎఫ్) ఫైల్ నంబర్ బీ3/2681/1996
జీ) ఫైల్ నంబర్ బీ3/2682/1997
హెచ్) ఫైల్ నంబర్ బీ1/555/1993
(డీఆర్వో మేడ్చల్ జిల్లా)
ఐ) ఫైల్ నంబర్ ఎఫ్1/4418/2002
జే) ఫైల్ నంబర్ ఎల్పీ3/3065/2002
కే) ఫైల్ నంబర్ డీ5/4922/2005
ఎల్) ఫైల్ నంబర్ బీ1/15043/1977
ఎం) ఫైల్ నంబర్ బీ1/1426/1991
(డీఆర్వో మేడ్చల్ జిల్లా)
ఎన్) ఫైల్ నంబర్ ఈ5/5669/2002
శామీర్‌పేట మండల కార్యాలయంలో..
ఏ) ఫైల్ నంబర్ బీ/ఎస్పీఎల్/1993
బీ) ఫైల్ నంబర్ ఏ/1645/1992
సీ) ఫైల్ నంబర్ సీ/3002/1994
డీ) ఫైల్ నంబర్ బీ/3483/1998
ఈ) ఫైల్ నంబర్ ఏ/29/1991
ఎఫ్) ఫైల్ ఆర్సీ నంబర్ బీ/687/1999
సీసీఎల్ఏ కార్యాలయంలో..
ఫైల్ నంబర్ టీటీ3/3520/1996, A4/
1645/1992, A4/1045/1992.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో..
ఫైల్ నంబర్ ఏ4/1645/1992
ఫైల్ నంబర్ – ఏ4/1045/1992
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

