యువతి సరదా.. విపక్షాల దురద

- బర్రెలు కాస్తున్నట్టు ఇన్‌స్టాలో యువతి వీడియో
- సర్కార్‌ను బద్నామ్ చేసేందుకు వాడుతున్న బీజేపీ, కాంగ్రెస్
- తన సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్ చేస్తున్న బీజేపీ
- రీట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఫాలో అవుతున్న సీతక్క
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు విపక్షాలు దేనినీ వదులుతున్నట్టు లేదు. చివరకు సిల్లీ వీడియోస్ కూడా. ఓ యువతి సరదాగా చేసిన టిక్‌టాక్ వీడియో వారికి కొబ్బరికాయ దొరికినట్టయింది. ప్రతిపక్ష పార్టీలు. నిస్సిగ్గుగా ఈ వీడియోను ఉపయోగించుకుని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి .ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి తెగ ఆయాసపడుతున్నది. సోషల్ మీడియా ఖాతాల్లో దీనిని వైరల్ చేసి మురిసిపోతున్నది. సర్కారుపై ఇంత బురద చల్లానని సంబురపడుతున్నది. పేర్లు మార్చుతూ, అకౌంట్లు మార్చుతూ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ ఇలా ఏ వేదిక ఉంటే ఆ వేదికపై వైరల్ చేస్తూ బురదచల్లాలని చూస్తున్నది. ఇక నేనేం తక్కువ కాదన్నట్టు కాంగ్రెస్ అదేరీతిన వ్యవహరిస్తున్నది. సోషల్ మీడియా ఖాతాల్లో వైరల్ చేయడమే కాదు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఏకంగా ఇన్‌స్టాగ్రాంలో సదరు యువతిని ఫాలో అవుతున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా సదరు యువతి చేసిన వీడియోను ఐపీఎస్ అధికారిగా ఏండ్లపాటు పనిచేసిన అనుభవమున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేయడం పరాకాష్ట.
బర్రెలు కాస్తున్నదట.. కానీ ఆ ప్రాంతం తెలియదట
సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న యువతి ఇన్‌స్టాలో తాను ఉపాధి కోసం బర్రెలు కొనుక్కున్నట్టు సరదాగా వీడియో తీసింది. అందులో తన ఆకతాయితనాన్ని బయటపెట్టుకుంటూ ‘హాయ్ ఫ్రెండ్స్ బర్రెలు కాయడానికి వచ్చిన.. కానీ ఇక్కడ ఉన్న చెరువు, ఈ గట్లు ఇదంతా ఎవరివో నాక్కూడా తెల్వదు’ అనేసింది. ఆ మాటల్లోనే ఆమె కేవలం సరదాగా ఆ వీడియో తీసినట్టు స్పష్టమవుతుంది. ఇలా ఆ యువతి ఇన్స్టాగ్రాం అకౌంట్లో దాదాపు 157 వీడియోలు ఉన్నాయి. అన్నింటిలో మొత్తానికి మొత్తం సినిమాల్లోని డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేస్తూ పెట్టుకున్నవే. అలాంటి నాన్‌సీరియస్ వీడియోలను తమ కుట్రలకు వాడుకుంటూ బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు తమ దిగజారుడుతనాన్ని మరోమారు బయటపెట్టుకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- insta video
- young women
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

