ఆసిఫాబాద్ టౌన్, (వాంకిడి), జూలై 17: బెల్ట్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేస్తూ వాంకిడి మండలం చిచ్పల్లి, సోనాపూర్, గణేశ్‌పూర్, పోనగూడ గ్రామాలకు చెందిన మహిళలు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్, జిల్లా ఎస్పీకి వినతి పత్రాలు అందజేశారు. బెల్ట్ షాపులతో మద్యానికి బానిసలై కుటుంబాలను పట్టించుకోవడంలేదని, ఆరోగ్య సమస్యలు ఎదురొంటున్నారని, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నదని, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు వినతిపత్రం అందజేసినా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.