VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
VC Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య తనను వేధించాడని.. మొదట తనకు నాకు అర్థం కాలేదు.. ఆయనను నేను ఒక తండ్రిలా భావించా.. ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేకపోయానన్నారు మహిళా ప్రొఫెసర్.
VC Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య తనను వేధించాడని మీడియా సాక్షిగా మహిళాప్రొఫెసర్ తన ఆవేదనను చెప్పుకున్నారు. ప్రెస్‌క్లబ్‌లో సదరు మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతూ.. జానయ్య బయోలాజికల్ నీడ్స్ అనే పదం వాడటం, నువ్వు 20 ఏండ్ల ముందు పుట్టి ఉంటే పెళ్లి చేసుకునేవాడిని అంతిష్టమని అనడం.. నువ్వు నాతో బయటకు రావాల్సింది.. మొదట నాకు అర్థం కాలేదు.. ఆయనను నేను ఒక తండ్రిలా భావించా.. ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేకపోయానన్నారు.
రెండో రోజు మళ్లీ నాకు కాల్ వచ్చింది.. నువ్వు నాతో బయటకు రావాల్సింది.. నీతో కొంచెం టైం గడపాలి.. హైదరాబాద్‌లో అయితే అందరూ తెలిసినవాళ్లుంటారు.. ఇక్కడైతే ఎవరూ ఉండరు.. నేను జీర్ణించుకోలేకపోయాను. ఆయనను నేను ఈ రకంగా భావించలేదు.. చాలా వరకు ఆయన మాటలను కట్ చేయడానికి ప్రయత్నించా.. కొన్నిసార్లు మనల్ని మనం ఒప్పుకోవడానికి కూడా టైం పడుతుంది. 6వ తేదీన ఉదయం రా కలుద్దాం అన్నారు.. పదే పదే అనడంతో నా సహోద్యోగి, పీహెచ్డీ చేస్తున్న అమ్మాయిని అక్కడికి భయంతో పట్టుకొని వెళ్లాను. మా డీఆర్ సార్ బలరాంతోపాటు అందరూ ఉన్నారు.. ఇంక ఆయన ఏం మాటలు మాట్లాడడేమో ఏం అనడేమో అని నేనక్కడి నుంచి వచ్చేస్తుంటే కారు వెళ్లిపోయే ముందు ఆపి తొందరగా వచ్చేసెయ్.. నువ్విక్కడే ఉండొద్దన్నాడు. ఆరోజు రాత్రి నాకు మళ్లీ కాలొచ్చింది..నేను ఫోన్ ఎత్తలేదు.. 15 నిమిషాల తర్వాత ఫోన్ చేశా.. ఏం చేస్తున్నావమ్మా అంటే నా భర్తతో మాట్లాడుతున్నా అని చెప్పా.. ఆయనేమో ఫోన్లో నేనున్నది హిస్సార్‌లో ఒకసారి నాతో ఢిల్లీకి రావాల్సిందంటే నేను రాలేనని చెప్పా.
నీకు చిన్న చిన్నపిల్లలున్నారు.. నీ భర్త ఇక్కడుండడు అబుదాబిలో ఉంటడు.. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసరికి భయమేసింది. ఎందుకంటే ఆయనకు చాలా పొలిటికల్ పవర్ ఉంది.. నాకు తెలుసు.. ఆర్థికంగా కూడా బలవంతుడు.. చాలా మంది మద్దతిచ్చే వాళ్లు కూడా ఉన్నారంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రేవంత్ రెడ్డి సన్నిహితుడు అల్డాస్ జానయ్య భాగోతం
తనను అల్డాస్ జానయ్య వేధించాడని మీడియా సాక్షిగా తన ఆవేదనను చెప్పుకున్న మహిళా ప్రొఫెసర్
20 ఏళ్ల ముందు పుడితే నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని
నీతో ఏకాంతంగా గడపాలని ఉంది
నీ భర్త వదిలేస్తే నిన్ను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
అల్డాస్ జానయ్యపై మహిళా కమిషన్, డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
నీ పరువే పోతుంది పిర్యాదు వెనక్కి తీసుకో అని బెదిరింపులు వచ్చాయి
లాభం లేదని నేనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను
అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్ ఆవేదన
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

