రోడ్డు ప్రమాదంలో మహిళా రైతు మృతి
కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూర్పారా పట్టేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళా రైతు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది.
- ధాన్యాన్ని తూర్పారపట్టేందుకు వెళ్తుండగా ఘటన
పెద్దవంగర, మే 10: కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూర్పారా పట్టేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళా రైతు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కొరిపెల్లి శివారులోని శంకర్‌తండాకు చెందిన జాటోత్ వెంకన్న తన భార్య జాటోత్ విజయ, చిన్నమ్మ జాటోత్ భద్రమ్మ(60)తో కలిసి బైక్‌పై వడ్డెకొత్తపల్లి కొనుగోలు కేంద్రానికి బయల్దేరారు. ఈక్రమంలో కొరిపెల్లి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఘటనలో భద్రమ్మ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వెంకన్న, విజయకు తీవ్రగాయాలవడంతో 108లో తొరూర్రులోని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రమోద్‌కుమార్ తెలిపారు.
ప్యాడీ క్లీనర్ల కొరతతోనే..
వడ్డెకొత్తపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 8వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం వచ్చింది. తూర్పార పట్టే ప్యాడీ క్లీనర్ ఒక్కటే ఉండటంతో రైతుల మధ్య పోటీ నెలకొన్నది. దీంతో రాత్రివేళ ధాన్యం తూర్పార పట్టేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్పారు. ప్యాడీ క్లీనర్ల కొరతతోనే ఇది జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

