కాన్పు సమయంలో కడుపులో దూది.. తీవ్రమైన నొప్పితో మహిళ మృతి
KK Nursing Home | యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు నిమిత్తం.. ఏడాది క్రితం భువనగిరి కేకే ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు సర్జరీ నిర్వహించి డెలివరీ చేశారు. ప్రసవం తర్వాత సదరు మహిళ

యాదాద్రి భువనగిరి : వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొన్నది. ఏడాది పాపను అనాథ చేసింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు నిమిత్తం.. ఏడాది క్రితం భువనగిరి కేకే ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు సర్జరీ నిర్వహించి డెలివరీ చేశారు. ప్రసవం తర్వాత సదరు మహిళ కడుపునొప్పితో బాధపడింది. క్రమక్రమంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. ఇటీవలే చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల మెడికల్ టెస్టులు నిర్వహించగా, కడుపులో దూది ఉన్నట్లు గుర్తించారు.
తొలికాన్పు సమయంలో ఆమె కడుపులో దూది అలానే ఉంచి, మరిచిపోయి కుట్లు వేశారు. ఆ దూది అలాగే ఉండటంతో పేగులు దెబ్బతిని తీవ్రమైన కడుపునొప్పికి కారణమైంది. హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో బాధిత మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమెకు తొలి కాన్పు చేసిన భువనగిరి కేకే ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

