గర్భిణికి పురుడు పోసిన 108 సిబ్బంది.. పండంటి మగబిడ్డకు జన్మ
108 Ambulance | పురిటి నొప్పులతో భాద పడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రాజేశ్వరికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా 108కి ఫోన్

మంచిర్యాల : పురిటి నొప్పులతో భాద పడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రాజేశ్వరికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా 108కి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ ప్రవీణ్, పైలెట్ ఇమామ్ షరీఫ్ 108 వాహనం తీసుకొని కొల్లూరు బయలుదేరారు.
రాజేశ్వరికి పురిటి నొప్పులు తీవ్రం అయ్యాయి. వెంటనే ఈ విషయాన్ని 108 ఉన్నత అధికారులకు 108 సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం అందించారు. గర్భిణిని దవాఖానకు తీసుకువెళ్లేందుకు సమయం లేకపోవడంతో 108 ఉన్నత అధికారుల సూచనలు మేరకు ఇంట్లోనే ప్రసవం జరిపించగా కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండగా వారిని వైద్య పరీక్షల కోసం కోటపల్లి హాస్పిటల్ కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

