నిర్మాత కేపీ చౌదరి కాల్ లిస్ట్‌పై ఆరా
సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ పరిశ్రమలోని కొంత మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గోవా నుంచి తీసుకొచ్చిన 100 గ్రాము ల కొకైన్‌ను కిస్మత్పూర్ పరిసరాల్లో అమ్మేందుకు యత్నిస్తూ 14న పోలీసులకు దొరికిపోగా, అతడి వద్ద 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- డ్రగ్స్ కేసులో కస్టడీ కోరిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ పరిశ్రమలోని కొంత మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గోవా నుంచి తీసుకొచ్చిన 100 గ్రాము ల కొకైన్‌ను కిస్మత్పూర్ పరిసరాల్లో అమ్మేందుకు యత్నిస్తూ 14న పోలీసులకు దొరికిపోగా, అతడి వద్ద 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా కాల్ లిస్ట్, వాట్సాప్ చాటింగ్, మెసేజ్‌లను పరిశీలించగా కీలక సమాచారం దొరికినట్టు తెలిసింది.
కేపీ చౌదరి నగరంలోని ఓ పబ్బులో పార్టీలు నిర్వహిస్తూ, కొకైన్ సరఫరా చేస్తుండేవాడని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఆ పార్టీల్లో పాల్గొన్నవారి జాబితాను తయారుచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు, వారికి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు సేకరించేందుకు చౌదరి కస్టడీ కోరుతూ రాజేంద్రనగర్ పోలీసులు కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

