మరియమ్మ మృతిపై సమగ్ర విచారణ

- ఈ తరహా ఘటనలు పునరావృతం కానివ్వం
- మీడియా సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి
ఖమ్మం, జూన్ 27(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్న రాష్ట్రంలో ఇటువంటి ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతామన్నారు. ఆదివారం ఖమ్మం వచ్చిన ఆయన ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐజీ నాగిరెడ్డి, సీపీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. మరియమ్మ మృతిపై అన్ని కోణాలో విచారణ జరుగుతుందన్నారు. ప్రజల ఆత్మగౌరవం, వారి ప్రాణాలకు ఇబ్బంది కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరియమ్మ మృతిపై స్పందించిన ప్రభుత్వం ఆమె కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

