Mancherial | మంచిర్యాల జిల్లాలో దారుణం.. చికెన్ వండలేదని భార్యను హతమార్చిన భర్త
Mancherial | మంచిర్యాల : చికెన్ వండలేదని భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వెలుగు చూసింది.
Mancherial | మంచిర్యాల : చికెన్ వండలేదని భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వెలుగు చూసింది.
నిన్న రాత్రి భర్త గాలిపెల్లి పోశం(50) చికెన్ తీసుకురాగా, భార్య వండలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య శంకరమ్మపై పోశం గురువారం ఉదయం గొడ్డలితో దాడి చేశాడు. విచక్షణారహితంగా నరికి చంపాడు. అనంతరం పోశం పరారీ అయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి పోలీసులు చేసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

