బీఎస్సీ, పీబీ బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి 22 నుంచి వెబ్ కౌన్సెలింగ్
Kaloji Health University | బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 22 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 25 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మెరిట్ జాబితా అదేవిదంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కళాశాల వారీగా సీట్ల వివరాలను knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

