AV Ranganath | బీకేర్ ఫుల్.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే : వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్
AV Ranganath | బహిరంగంగా తల్వార్(కత్తి)ను ప్రదర్శించడంతో పాటు ఎలాంటి ప్రదర్శనలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
వరంగల్ : బహిరంగంగా తల్వార్(కత్తి)ను ప్రదర్శించడంతో పాటు ఎలాంటి ప్రదర్శనలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం వరంగల్ కమిషనరేట్ పరిధిలో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోవడంతో పాటు, కొంత మంది వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యదేచ్ఛగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండంపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఇకపై ఎవరైన వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల సందర్భంగాని లేదా ఇతర కార్యక్రమాల సమయాల్లో తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయడంతో పాటు తల్వార్లు పట్టుకొని ఉన్న ఫోజులతో దిగిన ఫొటోలతో కూడిన ప్లెక్సీలను కూడళ్లల్లో ఏర్పాటు చేయడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు.
ముఖ్యంగా యువకులు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రధాన రోడ్డు మార్గాల్లో ద్విచక్ర వాహనాలను నిలిపివేసి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవరైనా వ్యక్తులు బహిరంగంగా తల్వార్లను ఎత్తిచూపినా, వాటిని తిప్పుతున్నా పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

