యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు నిధులిస్తాం
రాష్ట్రంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)సంతృప్తి వ్యక్తం చేశాయి.
- ఆర్ఈసీ, పీఎఫ్సీ సీఎండీల హామీ
- సీఎండీ ప్రభాకర్‌రావుతో భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టుకు నిర్దేశించిన గడువు ప్రకారం రుణాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ఆర్ఈసీ సీఎండీ రవీందర్‌కుమార్ దేవాంగన్, పీఎఫ్సీ సీఎండీ రవీందర్ సింగ్ దిల్లాన్ హామీ ఇచ్చారు. వీరు మూడురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌తో పాటు కాళేశ్వరం, ఇతర విద్యుత్తు ప్రాజెక్టులను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో కలిసి పరిశీలించారు. పనుల నిర్వహణ గురించి ప్రభాకర్‌రావు వారికి వివరించారు. యాదాద్రి పనులు చేపడుతున్న బీహెచ్ఈఎల్ యాజమాన్యంతో ఆర్ఈసీ, పీఎఫ్సీ సీఎండీలు మాట్లాడారు. అనంతరం యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టులపై సమీక్షించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశం ముగిశాక ఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ సీఎండీలు ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

