World Water Day | ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి : మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, భవిష్యత్ తరాలకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలందరికి ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నీటిని వినియోగించడంలో, పొదుపు చేయడంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహం మిగతా రాష్ట్రాలకు విభిన్నం అన్నారు.
సీఎం కేసీఆర్ ఒకవైపు నదీజలాల్లో వాటాను పూర్తిగా సద్వినియోగం చేస్తూ ప్రణాళికాబద్ధంగా బరాజ్‌లను, రిజర్వాయర్లను నిర్మిస్తూనే మరోవైపు నదుల పునరుజ్జీవనానికి బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల నాటి 27,785 గొలుసుకట్టు చెరువులు, కుంటలను బాగు చేసి, గ్రామాల్లో భూగర్భ నీటి మట్టం 4.35 మీటర్లు పెంపునకు దోహదం చేశారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గూడాలు, తండాలకు కూడా నల్లాల ద్వారా శుద్ధి చేసిన, స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు దేశానికే దిక్సూచిగా నిలుస్తుండటం తెలంగాణకు గర్వకారణం అన్నారు. నీటిని పొదుగా వాడుకొని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అదించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

