సాగర్ ఎడమ కాలువకు నీళ్లియ్యాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
పోతిరెడ్డిపాడు ద్వారా నాగార్జునసాగర్‌ను నింపి ఎడమ కాలువ ద్వారా జిల్లా రైతాంగానికి నీళ్లు వదలాలని, లేనిపక్షంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీఎత్తున ఆందోళన చేస్తామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య హెచ్చరించారు.
- లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదు
- రేవంత్‌రెడ్డీ.. నల్లగొండ జిల్లాపై నిర్లక్ష్యమెందుకు?
నకిరేకల్, ఆగస్టు 22 : పోతిరెడ్డిపాడు ద్వారా నాగార్జునసాగర్‌ను నింపి ఎడమ కాలువ ద్వారా జిల్లా రైతాంగానికి నీళ్లు వదలాలని, లేనిపక్షంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీఎత్తున ఆందోళన చేస్తామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య హెచ్చరించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువును శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లా రైతులకు రెండు పంటలకు నీరందించిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుతం సాగర్‌లో 532 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నల్లగొండ జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగు, తాగునీటి సరఫరాపై తీవ్రనిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రైతుల అరిగోస, ఆక్రందన ఇరిగేషన్ మంత్రి చెవులకు వినిపిస్తలేదా? అని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి పుష్కలంగా నీరు వస్తున్నా సాగర్‌ను ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

