వికారాబాద్ జిల్లాలో అరుదైన ఘటన.. ఒక దూడకు రెండు తలలు..

బషీరాబాద్ : మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో శుక్రవారం ఓ గేదె దూడకు జన్మనివ్వగా అది రెండు తలల దూడగా జన్మంచింది. గ్రామానికి చెందిన వీరారెడ్డికి ఉన్న పశువుల్లో ఓ గేదె ఈతకు (దూడకు జన్మనివ్వడానికి) ఇబ్బంది పడుతుంటే పశువైద్యుడికి సమాచారం అందించాడు. పశు వైద్యుడు వచ్చి గేదెను పరీక్షించి కడుపులో రెండు తలలున్న దూడ ఉందని చెప్పి, దూడను కడుపులోంచి తీశాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టూ పక్కల గ్రామస్తులు రెండు తలలున్న దూడను చూసేందుకు తరలి వస్తున్నారు. అయితే రెండు తలలతో జన్మించిన దూడ విషయంపై పశువైద్యుడు జన్యుపరమైన లోపంతోనే ఇలా జన్మిస్తుంటాయని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

