Vanama Arrest | వనమా రాఘవ అరెస్ట్
Vanama Arrest | రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వనమా రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.

Vanama Arrest | భద్రాద్రి-కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు తనయుడు వనమా రాఘవేంద్రను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. దట్టమైన అడవీ ప్రాంతమైన దమ్మపేట పరిసరాల్లో పోలీసులు రాఘవను అదుపులోకి తీసుకున్నారు. ఒక వాహనంలో రాజమండ్రి పారిపోతున్నారన్న సమాచారం తెలుసుకుని చేజ్ చేసి అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. మూడు రోజులుగా రాఘవ పరారీలో ఉన్నాడు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను రెండో నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు.
రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య సంచలనం
కొత్తగూడెం-భద్రాద్రి జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో వనమా రాఘవేంద్ర ప్రమేయం ఉందని, ఆయన పెట్టిన ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు స్వయంగా రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పెను దుమారం చెలరేగింది. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాఘవేంద్రను టీఆర్ఎస్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రామకృష్ణ ఘటన తర్వాత రెండు సార్లు మీడియా ముందుకు వచ్చిన రాఘవేంద్ర తర్వాత కనిపించకుండా పోయారు.
రాఘవను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు
వనమా రాఘవేంద్రను పట్టుకునేందుకు పోలీసులు తొలుత మూడు బృందాలు.. తర్వాత ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. తొలుత హైదరాబాద్కు వెళ్లిన రాఘవ ఈ నెల నాలుగో తేదీన కొత్తగూడెం వచ్చాడు. కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత మళ్లీ మాయమయ్యాడు.
రాఘవ ఇలా దోబూచులాట
విజయవాడ మీదుగా చీరాలకు వెళ్లి.. లొంగిపోతానని సంకేతాలిచ్చి దోబూచులాడాడు. తిరిగి విశాఖపట్నం వెళ్లాడని పోలీసులు తెలిపారు. అతడి సెల్ఫోన్, కారు కదలికలను ట్రేస్ చేసి, రాఘవ జాడ కనిపెట్టామని చెప్పారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి రాఘవను అరెస్ట్ చేశామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

