అఖిలపక్ష భేటీలో ఉత్తమ్ అబద్ధాలు
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి అబద్ధాలు వల్లెవేశారు. కృష్ణా జలాల వినియోగంపై ప్రతిపక్షాలే తప్పుడు లెక్కలు చెప్తున్నాయని అంటూ ఆయనే తప్పుడు ప్రచారానికి దిగారు.
- కృష్ణా నీళ్లు ఏపీ కంటే మనమే ఎక్కువ వినియోగించుకున్నామని అసత్యాలు
- ప్రతిపక్షాల దుష్ప్రచారమేనని వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ) : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి అబద్ధాలు వల్లెవేశారు. కృష్ణా జలాల వినియోగంపై ప్రతిపక్షాలే తప్పుడు లెక్కలు చెప్తున్నాయని అంటూ ఆయనే తప్పుడు ప్రచారానికి దిగారు. బుధవారం సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నదీజలాల అంశంపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని భేటీ అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2026 అక్టోబర్ 28 నాటికి శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ 127.57 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 72.237 టీఎంసీలు, నాగార్జునసాగర్ జలాశయం నుంచి తెలంగాణ 41.908 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 17.207 టీఎంసీలు వినియోగించాయని వెల్లడించారు. ఈ గణాంకాలు ఇలా ఉంటే.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎకువ కృష్ణా జలాలను వినియోగిస్తున్నదని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ అవాస్తవమని పేర్కొనడం గమనార్హం.
ఎన్డీఎస్ఏ సూచనలేనంటూ అదే వాదన
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతు, పునరుద్ధరణ పనులు, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ కమిటీలో ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ, ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రముఖ నిపుణులు ఉన్నారని, వారి సూచనలనే తాము పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ బరాజ్‌ల మరమ్మతు పూర్తయ్యే వరకు, గేట్లను కిందకు దించడానికి ఎన్డీఎస్ఏ అనుమతించదని, ఈ పరిస్థితుల్లో నీటిని నిల్వ చేయడం లేదా ఎత్తిపోత సాధ్యం కాదని స్పష్టంచేశారు. అన్నారం, సుందిళ్ల బరాజ్నూ ఉపయోగించకూడదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా పేర్కొన్నదని చెప్పారు. మేడిగడ్డ మరమ్మతులు చేసుకోవాలని ఎన్డీఎస్ఏ గతంలోనే సూచించినప్పటికీ, మంత్రి ఉత్తమ్ మాత్రం ఎన్డీఎస్ఏను సాకుగా పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

