గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో హైదరాదాద్ వర్సిటీకి స్థానం

హైదరాబాద్ : గ్లోబల్ రౌండ్ యూనివర్శిటీ ర్యాంకింగ్(ఆర్‌యూఆర్) 2021 లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం అగ్ర సంస్థలలో ఒకటిగా స్థానం సంపాదించింది. ఆర్‌యూఆర్ ర్యాంకింగ్స్‌లో మొత్తం 13 భారతీయ విద్యాసంస్థలు చోటుసంపాదించాయి. ఐఐఎస్సీ, ఐఐటీలు, ఐఐఎస్ఇఆర్-పూణేల తరువాత ర్యాంక్ పొందిన ఏకైక విశ్వవిద్యాలయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం అని వర్సిటీ తెలిపింది.
2021లో విశ్వవిద్యాలయ ప్రపంచ ర్యాంక్ 350 గా ఉంది. ఇదే 2020 లో 363వ స్థానంలో ఉంది. అదే బోధనా ర్యాంక్ ప్రపంచవ్యాప్తంగా 84 గా ఉందని వెల్లడించింది. క్లారివేట్ అనలిటిక్స్ భాగస్వామ్యంతో ఆర్‌యూఆర్ 2021 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌ను మంగళవారం విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 85 దేశాల నుండి 1,150 విశ్వవిద్యాలయాలు ఈ ర్యాక్సింగ్స్‌లో పాల్గొన్నాయి. బోధన, పరిశోధన, అంతర్జాతీయ వైవిధ్యం, ఆర్థిక స్థిరత్వం అనే నాలుగు అంశాలను సర్వేలో పరిగణలోకి తీసుకున్నారు.
గ్లోబల్ ర్యాంకింగ్‌పై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పా రావు పోడిలే మాట్లాడుతూ.. తమ విశ్వవిద్యాలయం టాప్ 350 ప్రపంచ సంస్థలలో స్థానం సంపాదించడం చాలా గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఆర్యూఆర్లో మొదటి ఆరు సంస్థలలో ఉన్న ఏకైక భారతీయ విశ్వవిద్యాలయం తమదన్నారు. తమ అధ్యాపకుల అద్భుతమైన పరిశోధనలు, యువ సహోద్యోగులకు సరైన దిశా నిర్దేశం అందించడంలోనూ, బోధనతో సహా అన్ని డొమైన్లలో చేసిన కృషికిగాను ఈ గుర్తింపు దక్కిందని వీసీ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

